ఫోర్న్ తో సహా రామ్ చరణ్ చెప్పిన కొన్ని నిజాలు

రామ్‌చరణ్‌ తొలిసారి ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో లైవ్‌చాట్‌ చేశారు. ఈ లైవ్ ఛాట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ధృవ గురించి, చిరు 150 వ చిత్రం గురించి, తమ అభిమాన హీరోలపై అభిప్రాయం, కబాలి గురించి ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారు. చివరకి మీరు ఫోర్న్ ఇష్టమా అనే ప్రశ్నను సైతం అడిగారు. అయితే ఇంతకీ వారేం ప్రశ్నలు అడిగారు. ఆయనేం సమాధానం ఇచ్చారు అనేది మీరు ఈ క్రింద చదవచ్చు. అలాగే ఆయన ఈ లైవ్ ఛాట్ లో ఓ కొత్త ప్రపోజల్ లాంటి ఆఫర్ తన అభిమానులకు పెట్టారు. అందరూ మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో ‘మెగాఫ్యాన్‌ ప్రాజెక్టు’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

* చిరంజీవి 150వ సినిమా టైటిల్ కత్తిలాంటోడు కాదు. ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదు. త్వరలోనే ప్రకటిస్తాం.

* కొందరు మెగా అభిమానుల్ని సెలక్ట్ చేసి చిరంజీవి 150వ సినిమా సెట్స్ లో ఆయన్ని కలిసే అవకాశం కల్పిస్తాం.

* సుకుమార్ తో నేను చేయబోయే తర్వాతి సినిమా అక్టోబరులో మొదలవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

* బాబాయి పవన్ కళ్యాణ్ బేనర్లో నేను చేయబోయే సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది.

* ధ్రువ ఫస్ట్ లుక్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలవుతుంది. సినిమా అక్టోబరు 7న రిలీజ్ చేస్తాం.

* ప్రభాస్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ మధ్యే బాహుబలి సెట్స్ లో అతణ్ని కలిశాను.

కబాలి చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.. అందరూ ఎదురుచూస్తున్నారు

మల్టిస్టారర్ చిత్రాలపై నాకు ఇంట్రస్ట్ ఉంది

 

Videos

14 thoughts on “ఫోర్న్ తో సహా రామ్ చరణ్ చెప్పిన కొన్ని నిజాలు

Leave a Reply

Your email address will not be published.