కేజ్రీవాల్‌ కోతిలా ఉన్నాడనుకునే వాడ్ని- రాంగోపాల్ వర్మ సంచలనం

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా కామెంట్లతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

భారత బలగాలు పాక్‌లో సర్జికల్‌ దాడులు జరిపిన ఘటనపై ఆధారాలు చూపాలని ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నెటిజన్లు కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. చేస్తున్నారు.

తాజాగా రాంగోపాల్‌ వర్మ కూడా కేజ్రీవాల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ‘జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్‌ దాడులు చేయాలి. కేజ్రీవాల్‌ వేసుకునే మఫ్లర్‌ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాడ్ని. ఇప్పుడు భారత సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే కోతి అని నిరూపించుకున్నాడు. ఆప్‌ పార్టీని ‘పాప్‌'(పాప్‌ అంటే పాపము) పార్టీగా మార్చాలి. జై అల్లా కేజ్రీవాల్‌’ అని ట్వీట్‌ చేశారు వర్మ.

అంతేగాక, మరో తీవ్ర వ్యాఖ్య కూడా తన ట్విట్టర్ చేశాడు. అయితే, ఇప్పటి వరకు రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గానీ, కేజ్రీవాల్ గానీ స్పందించలేదు. కాగా, కొందరు నెటిజన్లు మాత్రం రాంగోపాల్ వర్మ ట్వీట్లకు మద్దతు పలుకుతూ రీట్వీట్లు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన మెరుపుదాడుల విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సాక్ష్యాలు అడిగారని బిజెపి, మీడియాలు వాదిస్తున్నాయి.. కానీ వాటిల్లో నిజం లేదని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. బుధవారం గోవాలో మీడియా సమావేశంలో సిసోడియా ఎల్‌వోసీ దాడులపై స్పందించారు.

సబూత్‌(ఆధారాలు) అన్న పదమే ఉపయోగించలేదని, కేవలం పాకిస్థాన్‌ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలకు దీటుగా స్పందించాలని మాత్రమే ఆయన ప్రధానిని అడిగినట్లు సిసోడియా తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *