సంచలన తీర్పు: రేప్ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు

సీబీఐ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు మహిళల రేప్ కేసులో నిందితుడైన వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌‌ను దోషిగా తేల్చింది. 2002లో ఇద్దరు మహిళలను రేప్ చేశాడని గుర్మీత్ పై కేసు నమోదైంది.కాగా, ఆగస్టు 28న గుర్మీత్ బాబాకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. అయితే, ఆయన మద్దతుదారులు లక్షల సంఖ్యలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చారు. ఆయుధాలు, పెట్రోలు, డీజీల్ బాటిళ్లతో ఆందోళన నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో రెండు(పంజాబ్, హర్యానా) రాష్ట్రాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు గుర్మీత్ బాబా మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. గుర్మీత్ బాబాను అంబాలా జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గుర్మీత్ బాబాకు ప్రపంచ వ్యాప్తంగా 6కోట్ల మంది భక్తులుండటం గమనార్హం. విదేశాల్లోని భక్తుల నుంచి భారీగా ఇతనికి విరాళాలు అందుతున్నట్లు తెలిసింది.

రెచ్చిపోయిన బాబా అనుచరులు: ఉద్రిక్తత కాగా, కోర్టు తీర్పు అనంతరం డేరాబాబా అనుచరులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగి రెచ్చిపోయారు. దీంతో పంచకుల కోర్టు సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాబా అనుచరులను టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. మీడియా వాహనాలపైనా డేరాబాబా అనుచరులు దాడి చేశారు. దీంతో పలువురు జర్నలిస్టులకు  గాయాలయ్యాయి. బాబా ఆశ్రమం దగ్గర రెండు మీడియా  వాహనాలకు నిప్పంటించారు. దీంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

Videos

13 thoughts on “సంచలన తీర్పు: రేప్ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు

Leave a Reply

Your email address will not be published.