చీకటి నిజాలు: ‘పితాజీ మాఫీ’ అంటే రేప్‌

డేరా సచ్చా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ ఆగడాలకు సంబంధించిన సంచలన నిజాలను ఇద్దరు సాధ్వీ(రేప్‌కు గురైన మహిళలు)లు కోర్టులో బయటపెట్టారు. తన ప్రత్యేక మందిరంలో గుర్మీత్‌ మహిళలపై ఎలా అత్యాచారాలకు పాల్పడే వాడన్న విషయాలను కళ్లకు కట్టినట్లు పంచకుల సీబీఐ కోర్టులో జడ్జిలకు వివరించారు. గుర్మీత్‌కు ‘గుఫా'(ప్రత్యేక నివాసం) ఉండేదని, అక్కడకు తనకు నచ్చిన మహిళలను తీసుకెళ్లి పలుమార్లు రేప్‌ చేసేవాడని చెప్పారు.

గుఫాకు కాపలాగా మహిళా గార్డులు మాత్రమే ఉంటారని తెలిపారు. ‘పితాజీ మాఫీ’ అనే పదాన్ని ‘రేప్‌’కు ప్రత్యామ్నాయంగా వినియోగించేవారని పేర్కొన్నారు. సాక్షుల్లో ఒకరైన హర్యానాకు చెందిన మహిళ తాను 1999 జులై నుంచి డేరాలో ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ ఆర్థించిన తన అన్నను చంపేశారని సీబీఐ జడ్జి ఏకే వర్మకు ఆమె తెలిపారు.

1999 ఆగష్టులో గుర్మీత్‌ తనపై అత్యాచారానికి పాల్పడే వరకూ ‘పితాజీ మాఫీ’ అంటే తనకు తెలియదని చెప్పారు. రేప్‌కు గురికాక ముందు డేరాలోని మహిళలంతా తనను ‘పితాజీ మాఫీ’ జరిగిందా? అని ప్రశ్నించేవారని వెల్లడించారు. 1999 సెప్టెంబర్‌లో గుర్మీత్‌ తనపై అత్యాచారానికి పాల్పడట్లు మరో మహిళ తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు పోతాయని గుర్మీత్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చారని వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *