టీడీపీ యంగ్ ఎంపీకి త్వ‌ర‌లోనే పెళ్లి..!

దివంగ‌త కేంద్ర మాజీ మంత్రి కింజార‌పు ఎర్ర‌న్నాయుడు వార‌సుడిగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చాడు ఆయ‌న త‌న‌యుడు కింజార‌పు రామ్మోహ‌న్‌నాయుడు. నిండా 30 ఏళ్లు కూడా లేక‌పోయినా తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని పార్ల‌మెంటులో అడుగుపెట్టి ఢిల్లీ సాక్షిగా తెలుగోడి గోడును వినిపిస్తున్నాడు. మిగిలిన ఎంపీల్లా కాకుండా స‌బ్జెక్టు ఏదైనా అన‌ర్గ‌ళంగా సూటిగా మాట్లాడ‌డం రాము శైలి. అందుకే త‌క్కువ టైంలోనే ఆయ‌న రెండు తెలుగు రాష్ర్టాల రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆక‌ర్షించ‌డంతో పాటు తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లోకి దూసుకుపోయారు.

అచ్ఛం తండ్రి లాగానే అటు దేశ రాజ‌కీయాల్లో ఏపీ వాయిస్‌ను బ‌లంగా వినిపించ‌డంతో పాటు ఏపీకి జ‌రుగుతున్న అన్యాయం, బ‌డ్జెట్‌, నిధులు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను లోక్‌స‌భ‌లో చక్క‌గా ప్ర‌స్తావిస్తున్నారు. ఆస్ర్టేలియాలో చ‌ద‌విన రాముకు ఆంగ్లంపై స్ప‌ష్టంగా ప‌ట్టు ఉండడం కూడా మ‌రో ప్ల‌స్ పాయింట్‌. దీంతో అన్నింటా ఆయ‌న దూసుకుపోతున్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయాల్లో కూడా రాము అంద‌రిని క‌లుపుకుపోతూ ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న యువ రాజ‌కీయ వేత్త‌గా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. 30 ఏళ్లు కూడా లేని ఈ యంగ్ ఎంపీ చాలా చిన్న వ‌య‌స్సులోనే రాజ‌కీయంగా స‌మ‌గ్రంగా ఎంతో ప‌రిణితి సాధించారు. ఇదిలా ఉంటే ఈ యంగ్ ఎంపీ త్వ‌ర‌లోనే ఓ ఇంటి వాడ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇంటి వాడంటే పెళ్లికొడుక‌వుతున్నాడు. శ్రీకాకుళంలో ఓ అంద‌మైన ఇంటిని నిర్మించుకుంటున్న రాము ఈ యేడాది లేదా వ‌చ్చే యేడాది ఆరంభంలో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

రాము అమ్మ‌గారు దివంగ‌త కింజార‌పు ఎర్ర‌న్నాయుడి స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి, రాము సోద‌రి, వైకాపా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడ‌లు అయిన భ‌వాని రాముకు సంబంధాలు చూడ‌డం ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. రాముకు పిల్ల‌నిచ్చేందుకు కూడా ప‌లువురు రాజ‌కీయ‌, వ్యాపార వ‌ర్గాల‌కు చెందిన వాళ్లు సిద్ధంగా ఉండ‌డంతో పాటు ఎర్ర‌న్నాయుడు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి చుట్టూ తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ యంగ్ ఎంపీ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడ‌వ్వ‌డంతో పాటు రాజ‌కీయ జీవితంలోకి మంచి జోష్‌తో ఎంట్రీ ఇచ్చిన‌ట్టే ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోవాల‌ని ఆశిద్దాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *