రానా డైరెక్షన్.. బాలయ్య హీరో.. తల్లి రమ్యకృష్ణ.. విలన్ ఎన్టీఆర్!

వినడానికే చాలా ఎగ్జయిట్ మెంట్ కల్పిస్తున్న ఈ కాంబినేషన్.. ప్రాక్టికల్ గా ఇంపాజిబుల్ కావొచ్చు. కానీ.. రానాకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చి.. బాహుబలి సినిమాను నిర్మించే అవకాశం ఇస్తే.. కాంబినేషన్ ఇలాగే ఉంటుంది. రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ చేసే ఓ షోకు.. గెస్ట్ గా వెళ్లిన రానా.. చాలా విషయాలు పంచుకున్నాడు. ‘బాహుబలిని మీరు డైరెక్ట్ చేస్తే.. రోల్స్ ఎవరికి ఇస్తారు.. ఎవరితో నటింపజేస్తారు?’ అని ప్రదీప్ అడగ్గానే.. చాలా తెలివిగా రానా జవాబిచ్చాడు.

‘పౌరాణిక, జానపద కేరెక్టర్లలో దిట్ట అయిన బాలకృష్ణకు బాహుబలి.. ప్రస్తుత తరంలో బెస్ట్ యాక్టర్ అయిన ఎన్టీఆర్ కు భల్లాలదేవ.. సినిమాకు కీలకమైన శివగామి పాత్రకు మళ్లీ రమ్యకృష్ణనే తీసుకుంటా’ అని చెప్పాడు. అంటే.. హీరో కేరెక్టర్ లో బాలకృష్ణకు.. తల్లి కేరెక్టర్ లో రమ్యకృష్ణ అవుతుంది. అలాగే.. విలన్ కేరెక్టర్ లో ఎన్టీఆర్.. బాబాయ్ కు ఆపోజిట్ గా కనిపిస్తాడు. సరదాకే చెప్పినా కూడా.. ఈ కాంబినేషన్ మాత్రం.. చాలా ఆసక్తికరంగా కుదిరింది.

బాహుబలి విషయంలో కాకున్నా.. ఈ కాంబినేషన్ మరో మంచి కథతో రీల్ పైకి వస్తే.. అంతా అదుర్స్ అనాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published.