భల్లాల దేవ స్టన్నింగ్ లుక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , అనుష్క హీరోయిన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కామీడియా పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా బాహుబలి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ బల్గేరియా లో జరుగుతుంది. ఈ సినిమాలో భల్లాలదేవగా ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న దగ్గుబాటి రానా పుట్టినరోజు నేడు (డిసెంబర్ 14).

హీరో రానా దగ్గుబాటి తొలిసారిగా నెగెటివ్ రోల్ చేసినా కూడా.. ”బాహుబలి” సినిమాలో తన అత్యంత క్లాసిక్ ప్రదర్శనతో భయంకరమైన క్రూరుడు భల్లాలదేవగా అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ టాలెంటెడ్ హీరోకు 32వ జన్మదిన శుభాకాంక్షలను చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు.

ఎవ్వరూ ఊహించని రీతిలో ఇప్పుడు ”బాహుబలి 2” సినిమా నుండి రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు రాజమౌళి. అదిగో వస్తున్నా అరివీరభయంకరుడు అంటూ మనోడు ఈ లుక్ ను రిలీజ్ చేయడం విశేషం. గతంలో బాహుబలి 1 పోస్టర్లలో రానా తాలూకు యంగ్ లుక్ ను చూపిస్తే.. ఈసారి బాహుబలి కొడుకు శివుడుతో తలబడే సీనియర్ రానా దగ్గుబాటిని పోస్టర్ పై ఆవిష్కరించారు. కండల్లో శూరత్వం.. చూపుల్లో క్రూరత్వం.. కోపోద్రిక్తుడైన భల్లాలదేవ.. కట్టప్ప అసలు బాహుబలిని ఎందుకు చెప్పాడో తెలిపే కథలో.. తన వంతు రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. మీరు కూడా రెడీగా ఉండండి.

Videos

Leave a Reply

Your email address will not be published.