తల్లికాబోతున్నకాజల్… స్కానింగ్ ..!

సినీ హీరో రానా, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మంగళవారం బనగానపల్లె ఆసుపత్రికి చేరుకున్నారు.  రానా, కాజల్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ షూటింగ్ కర్నూలు జిల్లా బనగానపల్లిలోని ఆసుపత్రిలో జరుగగా, గర్భం ధరించి ఉన్న కాజల్ కు ఆసుపత్రిలో డాక్టర్ అయిన రానా స్కానింగ్ చేసే దృశ్యాలను చిత్రీకరించారు.

గత మూడు రోజులుగా యాగంటి పుణ్యక్షేత్రంలో చిత్రం షూటింగ్ జరుగుతోంది. తమ అభిమాన నటీనటులను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆసుపత్రికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇన్ పేషెంట్ గదికి వెళ్లే మార్గాన్ని ఆసుపత్రి నిర్వాహకులు మూసి వేయడంతో, రోగులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బుధవారం యాగంటిలో షూటింగ్‌ పూర్తవుతుందని యూనిట్‌ సభ్యులు తెలిపారు.

ఇక ఇదిలా ఉండగా.. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా, కాజ‌ల్ లతో పాటు అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేశ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.రామానాయుడు సమర్పిస్తున్నారు.

Videos

17 thoughts on “తల్లికాబోతున్నకాజల్… స్కానింగ్ ..!

Leave a Reply

Your email address will not be published.