టీజర్‌ : ఐదున్నర నిమిషాల యాడ్‌ బాబోయ్‌..? బడ్జెట్‌ నాలుగు కోట్లు

ఇప్పటి వరకు 30 సెకన్ల యాడ్‌ చూసాం.. 40 సెకన్ల యాడ్‌ చూసాం.. నిమిషం యాడ్‌ కూడా చూసాం.. మరి విషయం ఎక్కువగా చెప్పాల్సి వస్తే.. 2 నిమిషాల యాడ్‌ కూడా చేస్తారు. కానీ ఎక్కడైనా.. ఎప్పుడైనా ఐదున్నర నిమిషాల యాడ్‌ చూసారా..? ఇప్పుడు రోహిత్‌ శెట్టి చూపించాడు. ఏకంగా ఐదున్నర నిమిషాల యాడ్‌ చేసాడు ఈ దర్శకుడు. అది కూడా సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా. అంతేకాదు.. ఈ యాడ్‌ కు ఓ టీజర్‌ ను కూడా విడుదల చేసాడు రోహిత్‌. ముందు ఈ టీజర్‌ చూసి అంతా సినిమా అనే అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇది చింగ్‌ అనే చైనీస్‌ నూడిల్స్‌ కంపెనీ చేయించుకున్న అఫీషియల్‌ యాడ్‌. దీని కోసం పెట్టిన బడ్జెట్‌ అక్షరాలా నాలుగు కోట్లు.

రన్‌ వీర్‌ సింగ్‌, తమన్నా జంటగా నటించిన ఈ యాడ్‌ లో ప్రదీప్‌ రావత్‌ విలన్‌ గా నటించాడు. చింగ్‌ నూడిల్స్‌ ను ప్రమోట్‌ చేయడానికి చేసిన ఈ యాడ్‌ లో హాలీవుడ్‌ సినిమాను తలపించే సెట్లు.. గ్రాఫిక్స్‌.. ఫైట్లు.. పాట.. రొమాన్స్‌.. కామెడీ.. అన్ని ఐదు నిమిషాల్లోనే చూపించాడు రోహిత్‌ శెట్టి. చివర్లో ఆడవేశంలోనూ మెరిసాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి ఓ యాడ్‌ లోనే చిన్న సైజ్‌ సినిమా చూపించాడు రోహిత్‌. ఈ యాడ్‌ చూసిన తర్వాత రేపట్నుంచీ ప్రతీ కంపెనీ తమ యాడ్స్‌ కూడా ఇలాగే చేయాలని కోరుకుంటాయేమో మరి..!

Videos

246 thoughts on “టీజర్‌ : ఐదున్నర నిమిషాల యాడ్‌ బాబోయ్‌..? బడ్జెట్‌ నాలుగు కోట్లు

Leave a Reply

Your email address will not be published.