రష్మీకి అక్క‌డ ఎంత అవ‌మానం జ‌రిగిందంటే…!

ప్ర‌స్తుతం టాలీవుడ్ కు ఒక బ‌ల‌మైన మార్కెట్ ఓవ‌ర్సీస్. ఇండియాలో బాలీవుడ్ తర్వాత ఓవ‌ర్సీస్ మార్కెట్ ను శాసిస్తోంది తెలుగు సినిమాలే. మ‌న ద‌గ్గ‌ర రిలీజైన ప్ర‌తీ సినిమా అక్క‌డ కూడా రిలీజ్ అవుతోంది. ఇక్కడ ఫ‌లితంతో సంబంధం లేకుండా, కేవ‌లం అక్క‌డే హిట్టై లాభాలు తెచ్చుకున్న సినిమాలు కూడా ఉన్నాయంటే ఆశ్చ‌ర్యం లేదు. అయితే ఈ సూత్రం అన్ని సినిమాల‌కు వ‌ర్తించదు. కేవ‌లం క్లాస్ సినిమాల‌ను మాత్ర‌మే అక్క‌డి ఆడియ‌న్స్ చూస్తున్నారు. ఏ సినిమా ప‌డితే అది చూసేందుకు మ‌న ఎన్నారై బ్ర‌ద‌ర్స్ కు మ‌న‌సొప్ప‌దు. ఈ విష‌యాన్ని “చారుశీల” సినిమా విష‌యంలో మ‌రోసారి ప్రూవ్ చేశారు అక్క‌డి జ‌నాలు

తెలుగు బుల్లి తెర‌పై సెన్సేష‌న్ గా మారిన యాంక‌ర్ రష్మి, మ‌ధ్య మ‌ధ్య‌లో గ్లామ‌ర్ డోస్ పెంచేసి సినిమాలు కూడా చేస్తోంది. రీసెంట్ గా ఈ అమ్మ‌డు చేసిన థ్రిల్ల‌ర్ “చారుశీల‌”. ఈ సినిమా కాస్త భిన్నంగా చేశాన‌ని భావించిన ర‌ష్మి, మూవీకి అమెరికాలో ప్రీమియ‌ర్ ఏర్పాటు చేయ‌మ‌ని అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్స్ ను అడిగింద‌ట‌. అక్క‌డ ఉండే త‌న అభిమానులంతా వ‌స్తార‌ని ఎంతో ఆశ‌గా ఎదురుచూసిన ర‌ష్మికి చుక్కెదురైంది. క‌నీసం ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఈ ప్రీమియ‌ర్ కు రాలేద‌ని స‌మాచారం. దీంతో ఈ అమ్మ‌డు పూర్తిగా డీలా ప‌డిపోయింద‌ట‌.

స్మాల్ స్క్రీన్ లో కుమ్మేస్తున్నా, బిగ్ స్క్రీన్ కు వ‌చ్చేస‌రికి ఈ పాప ఫేట్ మారిపోయింది. హీరోయిన్ గా వ‌ర‌స‌గా చాలా సినిమాలే చేసేసినా, ఒక్క సినిమా కూడా స‌రైన క‌లెక్ష‌న్స్ తెచ్చుకోక‌పోవ‌డంతో, ఇక సినిమా అవ‌కాశాలు క‌ష్టంలాగే క‌నిపిస్తోంది. ఇక ఈమె న‌టించిన మ‌రో సినిమా “త‌న వ‌చ్చెనంట” రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ మూవీ త‌ర్వాత ర‌ష్మి సినిమా ఫ్యూచ‌ర్ డిసైడ్ అయిపోతుంది. సినిమాలు లేక‌పోయినా, టీవీ ఉన్నంత కాలం ఈ భామ‌కు దిగులు లేదులే..!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *