టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపికపై అభిమానుల ఆగ్రహం

అంచనాలకు తగ్గట్లే భారత జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక అయ్యారు. బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి.. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రీనే తిరిగి ఎంపిక చేశారు. కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిల కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్, శ్రీలంకకు కోచ్‌గా పనిచేసిన టామ్‌ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. కానీ టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవిశాస్త్రి పేరు వెల్లడించగానే అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కోహ్లీకి ఏది నచ్చితే అదే చెల్లుబాటవుతుందని అభిమానులు మండిపడుతున్నారు. 2007 బంగ్లాదేశ్‌ పర్యటనలో జట్టు మేనేజర్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి.. 2014-2016 మధ్య కాలంలో జట్టు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇక 2017 నుంచి ఇటీవల పూర్తైన ప్రపంచకప్‌ వరకు టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యవహరించాడు.దీంతో శాస్త్రి నాలుగోసారి టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.

Videos

2 thoughts on “టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపికపై అభిమానుల ఆగ్రహం

  • November 15, 2019 at 9:47 am
    Permalink

    Hi there, just became alert to your blog through Google, and found that it is truly informative. I am gonna watch out for brussels. I will appreciate if you continue this in future. Lots of people will be benefited from your writing. Cheers!

  • January 16, 2020 at 10:10 pm
    Permalink

    Isotretinoin 10mg Amoxicillin Chronic Middle Ear Kamagra Francais Acheter cialis price Amoxicillin And Cats And Lathargic Buy Generic Prednisone Online Keflex Ng Tube Compatability Drug Route

Leave a Reply

Your email address will not be published.