గాల్ టెస్ట్ తో అశ్విన్ 50 మ్యాచ్‌ల రికార్డు

రవి చంద్రన్ అశ్విన్ క్రికెట్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రధానంగా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ల వరుసలో అశ్విన్ అందరికొంటే ముందు నిలుస్తాడు. ఆరేళ్ల క్రితం న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్ ప్రత్యర్థిగా టెస్ట్ అరంగేట్రం చేసిన అశ్విన్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసిందిలేదు. గత సీజన్ వరకూ ఆడిన మొత్తం 49 టెస్టుల్లో అత్యంత వేగంగా 275 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 25 సార్లు 5 వికెట్లు, 7సార్లు 10 వికెట్లు పడగొట్టిన రికార్డులు ఉన్నాయి. తన కెరియర్ లో అత్యుత్తమంగా 59 పరుగులకే 7 వికెట్లు సాధించాడు. స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో భాగంగా మొత్తం 32 టెస్టుల ఆడిన అశ్విన్ 208 వికెట్లు పడగొట్టాడు. 20 సార్లు 5 వికెట్లు, 6 సార్లు 10 వికెట్ల రికార్డులు సొంతం చేసుకొన్నాడు. ఇక విదేశీ టెస్ట్ సిరీస్‌ల్లో ఆడిన మొత్తం 17 టెస్టుల్లో 67 వికెట్లు సాధించాడు.

అత్యుత్తమంగా 83 పరుగులకు 7 వికెట్ల రికార్డు నమోదు చేశాడు. విదేశీ సిరీస్ ల్లో ఐదుసార్లు 5 వికెట్లు, ఒక్కసారి మాత్రమే 10 వికెట్ల రికార్డు తన ఖాతాలో జమచేసుకొన్నాడు. ప్రస్తుత శ్రీలంక టూర్ లో భాగంగా గాల్ టెస్ట్ ద్వారా విదేశీ గడ్డపై 18వ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ తనజట్టుకు విజయం అందించడం ద్వారా చిరస్మరణీయంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన ప్రతి టెస్టూ సత్తాచాటుకోడానికి లభించిన ఓ గొప్ప అవకాశం అంటూ టెస్ట్ ల హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆఫ్ స్పిన్నర్ల జాబితాలో చేరనున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *