కోర్టులో లొంగిపోయిన జ‌గ‌న్ మామ‌

వైకాపా అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కు స్వ‌యానా మేన‌మామ‌, క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి శుక్ర‌వారం కోర్టులో లొంగిపోవ‌డంతో ఈ వార్త ఒక్క‌సారిగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఎందుకు కోర్టులో లొంగిపోయారు..అస‌లేం జ‌రిగిందంటూ ఎవ‌రికి వారు ఆరాలు తీయ‌డం స్టార్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే హైద‌రాబాద్ మాదాపూర్ స‌మీపంలోని ఓ వాణిజ్య కేంద్రం స‌మీపంలో ఉన్న భూమిని ఆయ‌న గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోన‌కిలీ ప‌త్రాలు సృష్టించి త‌న సొంతం చేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

దీనిపై కొంద‌రు ఆ భూమి త‌మ‌దే అంటూ కోర్టులో ఫిటిష‌న్ వేశారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులో విచార‌ణ‌లో ఉంది. కోర్టు రవీంద్రనాథ్‌రెడ్డికి వారెంట్ ఇష్యూ జారీ చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా ఉమ్మ‌డి హైకోర్టు ఆయ‌న ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. అలాగే కిందికోర్టుకు వెళ్లాల‌ని కూడా ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డికి స్ప‌ష్టం చేసింది. దీంతో.. చేసేదేమీ లేక రవీంద్రనాథ్‌రెడ్డి తన లాయర్లను వెంట పెట్టుకొని కూకట్ పల్లి 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు.

శుక్ర‌వారం ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కూకట్ పల్లి 25వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చి పోలీసుల ముందు, కోర్టులో లొంగిపోయారు. మ‌రి ఈ భూదందా కేసు ఫైన‌ల్‌గా ఎలా ముగుస్తుంది…ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డిది భూదందానా కాదా అన్న‌ది కోర్టు విచార‌ణ‌లో ఏం తేలుతుంది అన్న‌ది చూడాలి.

Videos

6 thoughts on “కోర్టులో లొంగిపోయిన జ‌గ‌న్ మామ‌

Leave a Reply

Your email address will not be published.