150 ఓట్ల పార్టీ.. టీడీపీలోకి కలిసిపోతోందండోయ్!

మొత్తానికి ముసుగులు తొలగిపోతున్నట్టుగా ఉన్నాయి.. రాయలసీమ, రాయలసీమ ప్రయోజనాలు, ప్రత్యేక రాష్ట్రం.. అంటూ నినాదాలు చేసిన బైరెడ్డి  రాజశేఖర రెడ్డి తెలుగుదేశం దిశగా ముందుకు సాగుతున్నాడట. రాయలసీమ ఉద్యమం అంటూ మొదలుపెట్టిన ఈయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడని తెలుస్తోంది. అంతా పూర్తి అయ్యిందని, చర్చలన్నీ అయిపోయానని.. బైరెడ్డి పచ్చకండువాను మెడలో వేసుకోవడమే తరువాయి అని వార్తలు వస్తున్నాయి. బైరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం లీడర్లు చాలా కసరత్తే చేశారట.

ఆయనతో చర్చలు జరిపి.. పార్టీలోకి చేర్చడానికి రెడీ చేశారట. అసలుకు.. నంద్యాల బై పోల్ లో బైరెడ్డి పార్టీ తరపున అభ్యర్థి నిలవడమే పలు సందేహాలను రేకెత్తించింది, ప్రతిపక్ష పార్టీ ఓట్లను చీల్చడానికే ఆ పని జరిగిందని అంటారు. అయితే.. బైరెడ్డి పార్టీ అక్కడ చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది. ఎంతగా అంటే.. కనీసం రెండు వందల ఓట్లను కూడా పొందలేకపోయింది బై రెడ్డి పార్టీ. 150 ఓట్ల చిల్లరకే పరిమితం అయ్యింది. అదీ బైరెడ్డి పార్టీ సత్తా. అంతగా కాలికి బలపం కట్టుకుని తిరిగితే.. రాయలసీమ నినాదంతో.. రాయలసీమ గడ్డపై ఒక నియోజకవర్గంలో సాధించిన ఓట్లు ఇవి.

దాదాపు లక్షా డెబ్బై వేల ఓట్లు పోల్ అయితే.. అందులో నూటా యాభై ఓట్లను సొంతం చేసుకున్న ఆ పార్టీని తెలుగుదేశం పార్టీ విలీనం చేసుకుంటోందట. అతి త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నదని సమాచారం. చంద్రబాబు ఆధ్వర్యంలో బైరెడ్డి టీడీపీలో చేరనున్నాడని తెలుస్తోంది. మొత్తానికి.. తెలుగుదేశం పార్టీలోకి పెద్ద పార్టీనే విలీనం అవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *