ఆర్‌కాం వెర్‌లెస్‌ బిజినెస్‌ మూత.. ఉద్యోగులకు నోటీసులు?

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కాం)  సంచలనం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  కీలకమైన  వ్యాపారాన్ని మూసివేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం.   రాబోయే నెలలో వెర్‌లెస్‌ వ్యాపారానికి సంబంధించిన కీలకమైన డీటీహెచ్‌ సేవలను ఇకపై నిలిపివేయనుంది.

ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, తదుపరి 30 రోజుల్లో వెర్‌లైస్‌ బిజినెస్‌లోని  కీలక ఆపరేషన్లను ఆపివేస్తోంది.  ఈమేరకు ఉద్యోగులకు నోటీసు పీరియడ్‌ కూడా ఇచ్చినట్టు నివేదించింది. నవంబర్‌ 30వతేదీ ఉద్యోగుల ఆఖరి పనిదినంగా తెలిపింది.  ఖాతాదారుల  కొరత, భారీ నష్టాలు, కారణంగా 2 జీ ఆపరేషన్లను మూసివేసి 3 జీ, 4జీ సేవలపై దృష్టిపెట్టనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని రిపోర్ట్‌ చేసింది.

వ్యాపారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నించినప్పటికీ అనివార్య పరిస్థితుల కారణంగా  మూసివేయక తప్పడం లేదని  ఆర్‌కాం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గుర్‌దీప్‌ సింగ్‌ ఉద్యోగులకు చెప్పారు.  మరో 30 రోజులకు మించి ఈ బిజినెస్‌ నిలవలేదని  తెలిపింది. అయితే రిలయన్స్‌ జియో సహా ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో వ్యాపార అవకాశాలు కారణంగా టవర్ వ్యాపారం క్రియాశీలకంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.  డీటీహెచ్‌ వ్యాపారానికి గుడ్‌ బై చెప్పనుందని వార్తలతో ఆర్‌ కాం  భారీగా పతనమైంది.   పతనాన్ని నమోదు చేసింది. 5శాతానికిపైగా క్షీణించిఆల్‌టైం కనిష్టానికి చేరువగా  ఉంది. ఆర్‌కాం భారీ నష్టాలు టెలికాం మార్కెట్లోకి విచ్ఛిన్నకర విధానాలతో దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో ప్రధాన  కారణంగా నిపుణులు  భావిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *