గ్యారేజ్ వాయిదా వెన‌క రీజ‌న్ ఇదే

ఎన్నో అంచ‌నాల‌తో ఆగ‌స్టు 12న రిలీజ్‌కు రెడీ అయిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ ఎందుకు వెనక్కివెళ్లింది? కావాలనే డేట్‌ని మేకర్స్ మార్చారా? షూటింగ్ అయిపోయినా రిలీజ్‌డేట్ వెన‌క్కు వెళ్ల‌డానికి కార‌ణం ఏంటి ? దీనిపై ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు సోష‌ల్ మీడియాలో రైజ్ అవుతున్నాయి.

ఆగ‌స్టు 12న వ‌స్తుంద‌నుకున్న గ్యారేజ్ కాస్తా సెప్టెంబ‌ర్ 2కు వెళ్లిపోయింది. ఆ రోజు హ‌రికృష్ణ పుట్టిన రోజు. ముందుగా ఆగస్టు 12న రిలీజ్ చేస్తే.. వరసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో కలెక్షన్స్ పరంగా వర్కవుట్ అవుతుందని ప్లాన్ చేశారు. అప్పుడే కృష్ణా పుష్క‌రాలు కూడా ఉన్నాయి. దీంతో ఇది సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని అనుకున్నారు.

అయితే వ‌ర్షాల కార‌ణంగా సినిమా క్లైమాక్స్‌, ఇత‌ర స‌న్నివేశాలు లేట్ అవ్వ‌డంతో అది సెప్టెంబ‌ర్ 2కు వెళ్లిపోయింది. అప్పుడు కూడా లాంగ్ వీకెండ్ (4 రోజుల సెలవులు) కావడంతో ఆ డేట్‌ని ఓకే చేయడం, అదేరోజు హరికృష్ణ పుట్టినరోజు ఇలా అన్నీ కలిసొచ్చాయని అంటోంది యూనిట్. జనతా గ్యారేజ్ రిలీజ్ క్యాన్సిల్ కావడంతో ఆగస్టు 12, 13న నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 12న బాబు బంగారం, మోహ‌న్‌లాల్ మ‌న‌మంతా, 13న సాయిధ‌ర‌మ్ తిక్క రిలీజ్ అవుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *