పవన్‌తో డైవర్స్‌కు కారణం అప్పుడు చెబుతా: రేణూదేశాయ్‌

తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా పవన్‌కల్యాణ్‌ భార్యగా తెలుగునాట సూపర్‌ ఫేమస్‌ అయిపోయింది రేణూదేశాయ్‌. పవన్‌తో ఆమె సహజీవనం, ఎన్నికల సందర్భంగా పెళ్లి, విడాకులు.. ఇలా అన్నీ సూపర్‌ సెన్సేషన్‌గా నిలిచాయి. రేణు ఇప్పుడు పవన్‌ నుంచి విడిపోయి పిల్లలతో కలిసి పుణెలో నివసిస్తోంది. విడిపోయిన తర్వాత రెండు సినిమాలు డైరెక్ట్‌ చేసిన రేణు.. కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్‌ గురించి మాట్లాడింది.  ‘పవన్‌ నుంచి విడిపోయినా ఆయన నాకు ఎప్పుడూ గురువే.

ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇప్పటికీ ఆయనతో కలిసి బయట తిరుగుతుంటా. దీంతో నా ఫ్రెండ్స్‌ అందరూ అడుగుతుంటారు. ‘ఇంత క్లోజ్‌గా ఉంటున్నారు కదా.. మరి, విడాకులు ఎందుకు తీసుకున్నారు’ అని. విడాకులు తీసుకోవడానికి నా రీజన్స్‌ నాకు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చెప్పలేను. కానీ, కచ్చితంగా నేను త్వరలో రాయబోయే ఆత్మకథలో పవన్‌తో విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులను వెల్లడిస్తాన’ని చెప్పింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *