హిల్లరీతో ఇండియాకు డేంజర్!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఆరు రోజులే మిగిలింది. ఇటీవలి వరకు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ దూసుకుపోతూ కనిపించినా, తాజా పోల్స్‌లో కాస్త వెనుకంజ వేస్తున్నట్లు వెల్లడైంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నెమ్మదిగా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ హిందూ ఆర్గనైజేషన్ ప్రచారం తీవ్రతరం చేసింది. ఇండియన్-అమెరికన్ టెలివిజన్ ఛానళ్ళలో ప్రకటనలు ఇస్తోంది. హిల్లరీ పాకిస్థాన్ సానుభూతిపరురాలని, ఆమెకు సహాయకురాలిగా పాకిస్థాన్ సంతతి మహిళ సుదీర్ఘకాలం పని చేశారని చెబుతోంది. పాకిస్థాన్‌కు ఆమె బిలియన్ల డాలర్లను సహాయంగా అందజేశారని పేర్కొంది. మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించారని ప్రచారం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీసాను హిల్లరీ క్లింటన్ అడ్డుకున్నారని, రాడికల్ ఇస్లాంను సమర్థించే దేశాలు, వ్యక్తుల నుంచి ఆమె విరాళాలు స్వీకరిస్తున్నారని ఆ ప్రకటనల్లో రిపబ్లికన్ హిందూ కొయలిషన్ పేర్కొంది.
హిల్లరీ క్లింటన్ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పైనా, హిల్లరీకి సుదీర్ఘకాలం సహాయకురాలిగా పనిచేసిన హ్యూమా అబెదిన్‌పైనా ఈ ప్రకటనల్లో విమర్శలు చేశారు. హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలైతే చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ పదవిని హ్యూమా అబెదిన్‌కు కట్టబెడతారని పేర్కొన్నారు. కశ్మీరును పాకిస్థాన్‌కు ఇవ్వాలని బిల్ క్లింటన్ కోరుకుంటున్నారని కూడా వివరించారు. అమెరికన్లు రిపబ్లికన్‌కు ఓటు వేయాలని, దానివల్ల ఓటు వేసినవారికి, అమెరికా-భారతదేశం మధ్య సంబంధాలకు, అమెరికాకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
రిపబ్లికన్ హిందూ కొయలిషన్ చీఫ్ శలభ్ కుమార్ మాట్లాడుతూ హ్యూమా అబెదిన్ నేపథ్యం అనుమానాస్పదమన్నారు. ఆమెతో హిల్లరీ కలిసి ఉండటం తనకు అర్థం కావడం లేదన్నారు. ఫ్లోరిడా, ఉత్తర కరొలినా, ఓహియో రాష్ట్రాల్లో తాము ప్రచారం చేస్తున్నామన్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌ను సమర్థిస్తున్న ఇండియన్ – అమెరికన్లు ఈ ప్రకటనలపై మండిపడుతున్నారు. క్లింటన్ ప్రచారానికి నిదులను సేకరిస్తున్న అజయ్ జైన్ భుటోరియా మాట్లాడుతూ రిపబ్లికన్ హిందూ కొయలిషన్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *