‘రోబో-2’ ఫస్ట్ లుక్ లీక్ రజనీ, శంకర్ తలపట్టుకుంటున్నారు

ఫస్ట్ లుక్ లు, టీజర్లు, రాటలు, ఇలా ఒకటమేమిటి…ఏకంగా పూర్తి సినిమలు రిలీజ్ కు ముందే లీక్ అవటం ఈ మధ్య కాలంలో చాలా చాలా కామన్ అయ్యిపోయింది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఈ లీకేజ్ బాధ తప్పటం లేదు. అప్పటికీ సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెల్ ఫోన్స్ ని సైతం షూటింగ్ స్పాట్ లోకి అనుమతించటం లేదు. అయితే ఈ లీక్ లతో సినిమా టీమ్ లు ఎప్పటికప్పుడు సతమతమవుతూనే ఉంటున్నాయి. తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘2.0’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ లీకైందంటూ సోషల్‌మీడియాలో ఒక ఫొటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను అభిమానులు తెగ షేర్స్ చేస్తున్నారు. అది గమనించిన యూనిట్ వెంటనే రంగంలోకి దిగి దాన్ని ఖండించింది.

అయితే ఇది అధికారికంగా తాము విడుదల చేసింది కాదని చిత్ర యూనిట్ తెలిపింది. పోస్టర్‌లో డైలాగ్‌ రైటర్‌ పదాన్ని తప్పుగా రాశారని, అధికారిక ఫస్ట్‌లుక్‌ అయితే ఇలా తప్పులు దొర్లే అవకాశం లేదని తెలిపారు. ఆస్కార్‌ అవార్డు పొందిన ఎ.ఆర్‌. రెహమాన్‌ పేరు ఇందులో రెండో వరుసలో ఉందని, శంకర్‌ కచ్చితంగా ఆయన పేరుని మొదటి వరుసలో ఉంచుతారని పేర్కొన్నారు. శంకర్‌ తీసిన ప్రతి సినిమా పోస్టర్‌పై ‘శంకర్స్‌’, లేదా ‘ఏ ఫిల్మ్‌ బై శంకర్‌’ అని రాసి ఉంటుందని, కానీ ఇందులో.. డైరెక్టెడ్‌ బై శంకర్‌ అని ఉందని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *