రోహిత్ శర్మ పిలుపునిచ్చాడు

ఖడ్గమృగాలను సంరక్షించేందుకు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ (డబల్యూ‌డబల్యూ‌ఎఫ్) ఇండియా, యానిమల్ ప్లానేట్ తో కలసి పనిచేయడానికి సిద్ధమయ్యాడు. అంతరించిపోతున్న ఖడ్గమృగలను కాపాడటానికి తనతో చేతులు కలపాలని రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపుగా 3,500 ఖడ్గమృగాలు ఉన్నాయి. వీటిలో 82% భారత్ లోనే ఉన్నాయి. ఖడ్గమృగల కోసం ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం నాడు నాతో చేతులు కలపండి అని అన్నారు. రోహిత్ శర్మ 2018 లోనే డబల్యూ‌డబల్యూ‌ఎఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు స్వీకరించారు. వాటి కొమ్ముల కోసం ఖడ్గమృగాలను విచక్షణ రహితంగా చంపేస్తున్నారు. దీంతో వాటి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు వాటి సంరక్షణకు ఆయన పిలుపునిచ్చారు.

Videos