జబర్దస్త్ నుంచి రోజాను తప్పించే ప్రయత్నం

తెలుగు టీవి ప్రపంచంలో సూపర్ హిట్ కామెడీ షో ‘జబర్దస్త్’. ఈ షోలో నాగబాబుతో పాటు రోజా కూడా జడ్డిగా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఉన్నంత కామెడీ పంచ్ లు లేకపోవడం స్కిట్స్ రిపీట్ గా అనిపించడం ఉన్న వాటిలో బూతు కంటెంట్ పెరగడంతో.. ఇప్పుడీ షోకి క్రేజ్ తగ్గుతున్న మాట వాస్తవమే. అయితే.. ఈ జబర్దస్త్ నుంచి ఓ జడ్జ్ ను తొలగించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

రోజా తీరుపై గత కొంతకాలంగా అసహంగా ఉన్న టీడీపీ వర్గాలు ఆమెను ఈ షో నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నాయని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడది నిజమౌతోంది అని అంటున్నారు. గత కొంతకాలంగా … ఈ షో పాపులారిటీని కోల్పోతోంది. కంటెంట్ రిపీట్ అవటమే కారణం అంటున్నారు. ఈ పోగ్రామ్ ని నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి చెందిన మల్లెమాల ప్రొడక్షన్స్ రోజాని తప్పించే విషయమై గత కొంతకాలంగా ఛానెల్ వారితో సైతం మాట్లాడుతున్నారని, త్వరలో పూర్తి స్దాయి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.

త్వరలోనే ఈమె స్థానంలోకి మరో హీరోయిన్ వచ్చి చేరనుందని తెలుస్తోంది.పోగ్రామ్ టీఆర్పిలు సైతం తగ్గిన ఈ సమయంలో కొత్త నీరుతో ఈ పోగ్రామ్ ని పాతపడకుండా చేయాలని ఛానెల్ వారు , పోగ్రామ్ డిజైనర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Videos

6 thoughts on “జబర్దస్త్ నుంచి రోజాను తప్పించే ప్రయత్నం

Leave a Reply

Your email address will not be published.