అమితాబ్ దెబ్బకు ‘వన్‌ప్లస్’ వెబ్‌సైట్ క్రాష్!

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘వన్‌ప్లస్’ భారత మార్కెట్‌లో తన వాటాను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అందుకనే బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. బిగ్‌బీని ప్రచారకర్తగా నియమించుకున్న తరవాత తొలిసారిగా నిర్వహించిన ఓ కాంటెస్ట్ వన్‌ప్లస్ వెబ్‌సైట్‌కి ఎసరు పెట్టింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన వన్‌ప్లస్ 3టి కోసం ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కాంటెస్ట్’ను ప్రకటించింది. ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో ఒక లక్కీ విన్నర్‌కి రూ. కోటి నగదు నగదు బహుమతి అందజేస్తారు. దీంతో మరికొన్ని ఇతర అవార్డులు కూడా ఉన్నాయి.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనదలచిన యూజర్లు వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్‌సైట్ ద్వారా కాకుండా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. అయితే వన్‌ప్లస్ ఈ కాంటెస్ట్ మొదలుపెట్టిన తరవాత వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వెబ్‌సైట్ క్రాషయింది. యూజర్లు రిజిస్టర్ చేసుకోవడానికి వన్‌ప్లస్ వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. పోనీ మిస్డ్‌కాల్ ఇద్దామన్నా.. కాంటెస్ట్ హాట్‌లైన్ నంబర్ (85058 88888) కూడా పనిచేయడం లేదు. వాస్తవానికి ఈ కాంటెస్ట్‌‌లో పాల్గొనమని అమితాబ్ బచ్చన్, రోహన్ జోషి (ఏఐబీ ఫేమ్) నటించిన టీవీ యాడ్‌ను వన్‌ప్లస్ విడుదల చేసింది. ఇంతకీ ఆ రూ. కోటి గెలిచే అదృష్టవంతుడు ఎవరో..?

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *