స్మిత్ పునరాగమనం అద్భుతం :సచిన్

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. విషయానికి వస్తే యాషెస్ సిరీస్ లో తన బ్యాటింగ్ తో స్మిత్ ఇంగ్లండ్ కు చుక్కలు చూపిస్తున్నాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్టు లో రెండు భారీ సెంచరీలు చేయగా, రెండో టెస్టులో 92 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. దీనిపై స్పందించిన సచిన్ స్మిత్ పునరాగమనం అద్భుతంగా ఉందని కొనియాడాడు. క్లిష్టమైన టెక్నిక్ అతని సొంతమని అన్నారు. బాల్ తెంపరింగ్ వివాదంలో స్మిత్ ఏడాది పాటు క్రికెట్ కు దూరమయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యాషెస్ సిరీస్ ప్రదర్శనతో టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. టెస్టు కెరీర్ లో సచిన్ రికార్డును అధిగమించాడు. సచిన్ 136 ఇన్నింగ్స్ ల్లో 26 సెంచరీలు చేయగా స్మిత్ 121 ఇన్నింగ్స్ ల్లో 26 సెంచరీలు చేశాడు.

Videos