సాహోకు అరుదైన ఘనత ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ లో ప్రదర్శన

సాహో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్‌ గ్రాండ్‌ రెక్స్ లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. ఇప్పటికే సౌత్‌ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్‌, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. అత్యాధునిక సదుపాయాలున్న ఈ థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు అవకాశం దక్కటం గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్‌ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు. యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో సినిమా ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు సుజిత్‌ దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *