సాహో మరో ఘనత: ట్విట్టర్ ఇమోజీ వచ్చిన తొలి చిత్రం

ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రానికి దక్కని అరుదైన ఘనతను ‘సాహో’ సొంతం చేసుకుంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ‘సాహో’ ఇమోజీని విడుదల చేసింది. ప్రభాస్‌ గాగుల్స్‌ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న లుక్‌ను ఇమోజీగా రూపొందించారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇమోజీలు రాలేదు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ‘సాహో’ కావడం విశేషం. ఈ మధ్యకాలంలో తమిళంలో కాలా, సర్కార్‌, బాలీవుడ్‌లో జీరో, సుల్తాన్‌ సినిమాలకు ట్విటర్‌ ఎమోజీలు వచ్చాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లతో ‘సాహో’పై భారీ అంచనాలే నమోదయ్యాయి. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేషన్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Videos

2,365 thoughts on “సాహో మరో ఘనత: ట్విట్టర్ ఇమోజీ వచ్చిన తొలి చిత్రం