సాహో ప్రీరిలీజ్ వేడుక

సాహో రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో స్పీడు పెంచారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సాహో ఫీవర్ కొనసాగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ అభిమానులకు ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రామోజీఫిల్మ్‌ సిటీ ప్రాంగణంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, మురళీ శర్మ, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు సంగీతమందిస్తుండగా జిబ్రాన్‌ నేపథ్య సంగీతమందిస్తున్నాడు.

Videos

444 thoughts on “సాహో ప్రీరిలీజ్ వేడుక

Leave a Reply

Your email address will not be published.