సాహో మరో సర్ ప్రైజ్

సాహో మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు ప్రభాస్‌. యాక్షన్ జానర్‌లోరూపొందించిన ఈ గేమ్‌లో లీడ్ క్యారెక్టర్‌గా ప్రభాస్‌ కనిపిస్తున్నాడు. ఇంటెన్స్‌ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన ఈ గేమ్ టీజర్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. అడ్వంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందించిన సాహో ఈ నెల 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. 350 కోట్లతో భారీగా నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రద్ధా కపూర్, నీల్‌ నితిన్‌ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, మహేష్‌ మంజ్రేకర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published.