కెమిస్ట్రీ కోసమని డేటింగ్లో ఉన్నారా?
కృష్ణవంశీ సినిమాలో హీరో హీరోయిన్లు ఎలా ఉంటారో తెలుసు కదా? ప్రతీ సన్నివేశంలోనూ ఇద్దరి మధ్య రొమాన్స్ అదిరిపోతుంటుంది. ఇక పాటల్లో అయితే కెమిస్ట్రీ పీక్స్‌కి వెళుతుంటుంది. అంత కెమిస్ట్రీ పండాలంటే హీరో హీరోయిన్ల మధ్య పర్సనల్ రిలేషన్ బాగా ఉండాలి. అప్పుడే కెమెరా ముందు లీనమై నటిస్తారు. అందుకే కృష్ణవంశీ ఏ సినిమా తీసినా హీరోహీరోయిన్లపై ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేస్తుంటాడు. వాళ్లిద్దరికీ విలువైన సలహాలు ఇస్తుంటాడు.
ఈ మధ్య నక్షత్రం సినిమా విషయంలో సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్లకి కృష్ణవంశీ బోలెడన్ని కెమిస్ట్రీ పాఠాలు చెప్పాడట. ఆ పాఠాలకి అనుగుణంగానే ఆ ఇద్దరూ డేటింగ్మొ దలుపెట్టారని సమాచారం. అదే సినిమాలో తనకి మరో మంచి స్నేహితురాలైన రెజీనా నటిస్తున్నప్పటికీ సాయిధరమ్ తేజ్ మాత్రం ప్రగ్యాతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడట. వారిద్దరి మధ్య డేటింగ్ మరో స్థాయికి వెళ్లిందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి.