అర్ధ‌రాత్రి ఆ హీరోయిన్‌తో అడ్డంగా బుక్ అయిన సాయిధ‌ర‌మ్‌

మెగా యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ షాకింగ్ న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సాయిధ‌ర‌మ్ ఓ హీరోయిన్‌తో అర్ధ‌రాత్రి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడ‌ట‌. మొద‌ట్లో రెజీనా, ఆ తువాత ర‌కుల్‌ప్రీత్ సింగ్‌తో సాయికి లింకులు క‌డుతూ చాలా గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ప్ర‌స్తుతం ప్ర‌గ్యా జైస్వాల్‌తో ఈ మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్న గాసిప్ బ‌లంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దర్శ‌కుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న‌ న‌క్ష‌త్రంలో వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టిస్తున్నారు. ఆ చ‌నువు కొద్దీ… షూటింగ్ అనంత‌రం ఇద్ద‌రూ షికార్ల‌కు బ‌య‌ల్దేరుతున్నార‌ని టాక్‌. దీంతో.. మీడియాలో వీళ్ల‌పై గాసిప్పులు గుప్పుమంటున్నాయి. ఇటీవ‌ల రెండు మూడు సార్లు జూబ్లీహిల్స్ లోని ఓ నైట్ రెస్టారెంట్‌లో దాదాపు రెండు గంట‌ల పాటు కూర్చుని క‌బుర్లు చెప్పుకుంటూ డిన్న‌ర్ చేస్తూ మీడియాతో పాటు ప‌లువురి కంట ప‌డ్డార‌ట‌.

ఇలా ఒక‌సారి కాదు రెండుసార్లు కాదు మూడు నాలుగుసార్లు వీరు అర్ధ‌రాత్రి వ‌ర‌కు అదే రెస్టారెంట్‌లో వీరు లేట్ నైట్ పార్టీల‌ను ఎంజాయ్ చేయ‌డంతో వీరి మ‌ధ్య ఏదో ఉంద‌న్న ఊహాగానాల‌కు బ‌లం వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

Videos

Leave a Reply

Your email address will not be published.