ట్రైలర్: ‘శైలజారెడ్డి అల్లుడు.. ఫన్ బాగానే జనరేట్ అయింది

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ నాగార్జున బర్త్ డే కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో వాయిదా వేశారు.

“నాపేరు చైతన్య.. ముద్దుగా అందరూ చైతు అంటారు. దేన్నైనా పాజిటివ్  గా తీసుకునే సాఫ్ట్ కాండిడేట్ ని.  మనం లైఫ్ లో ప్రేమించే ప్రతిదాని వెనక ఓ కష్టముంటుంది. కానీ అది తట్టుకోగలిగితే లైఫ్ కలర్ ఫుల్ గా ఉంటుంది.” అంటూ తనను తాను పరిచయం చేసుకోవడంతో ట్రైలర్ స్టార్ట్ అయింది.  నాన్న(మురళి శర్మ) రూపంలో చిన్నప్పుడు.. ఇప్పుడేమో లవర్ రూపంలో మరొకరు.. అత్త రూపం లో ఇంకొకరిని ఇచ్చి దేవుడు గట్టిగా తొక్కేశాడు అని వాపోతున్నాడు.ఇక చైతు ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిషోర్ పంచ్ లు – శైలజా రెడ్డి భర్త పాత్రలో సీనియర్ నరేష్ అమ్మకి- కూతురికి మధ్యలో శాండ్ విచ్ అయిపోవడం –  శైలజా రెడ్డి సెక్రెటరీ(30 ఇయర్స్ పృథ్వి)ని అమ్మా కూతుళ్ళు కలిసి ‘మాణిక్యం.. మాణిక్యం’ అని మాటిమాటికీ ఆరుస్తూ ఎర్రటి మంటలో కబాబ్ ను కాల్చినట్టు కాల్చుకొని తినడం తో ఫన్ బాగానే జనరేట్ అయింది

టోటల్‌గా ట్రైలర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుందని అనిపిస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

45 thoughts on “ట్రైలర్: ‘శైలజారెడ్డి అల్లుడు.. ఫన్ బాగానే జనరేట్ అయింది

Leave a Reply

Your email address will not be published.