సాహోతో పాటు వస్తున్న సైరా

ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఈ నెల 30నా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పాటు మెగాస్టార్ చిరంజీవి హీరగా తెరకెక్కిన చారిత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి థ్రియేట్రికల్‌ ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంట. సాహో రిలీజ్ తోనే సైరా ప్రమోషన్లలో వేగం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలే. ఒకటి యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ అయితే మరొకటి చారిత్మక చిత్రం. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న సైరా టీమ్ ఇప్పుడు ట్రైలర్ ను మరింత ఆసక్తిగా రూపొందిస్తున్నారంటా. ఈ సినిమా అక్టోబర్ 2నా విడుదలకు సిద్దమవుతుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *