అమలాపాల్ కాపురంలో చిచ్చు పెట్టిన సమంత

హీరోయిన్ గా నటించిన అమలాపాల్ ఆ తరువాత విజయ్ అనే డైరెక్టర్ ని ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. వీరిద్దరి కాపురం సజావుగా సాగుతుంటే హాట్ బ్యూటీ సమంత చిచ్చు పెట్టిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అమలాపాల్ తన భర్త, ప్రముఖ డైరెక్టర్ ఏఎల్. విజయ్ తో కొంతకాలంగా దూరంగా ఉంటోందని, వీరిద్దరూ విడాకులు కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తమిళ స్టార్ హీరో ధనుష్ చిత్రం ‘వడ చెన్నై’ నుంచి సమంత వాకవుట్ చేసింది. కేవలం నాగచైతన్యతో పెళ్లి కోసమే సమంత ఈ సినిమాను వదులుకుందని ప్రచారం జరిగింది.

అయితే సమంత ఈ సినిమా నుంచి తప్పుకుంటూ ఈ క్యారెక్టర్ కు అమలాపాల్ అయితే కరెక్ట్ గా న్యాయం చేస్తుందని చెప్పిందట. అయితే పెళ్లి తర్వాత సినిమాలు మానేయేలని విజయ్ అమలకు కండీషన్ పెట్టాడట. కానీ అమలాపాల్ మాత్రం విజయ్ మాటను పక్కన పెట్టేసి సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా ధనుష్ వడ చెన్నై సినిమా విషయంలోనే వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయట. దీంతో ఎప్పట్నుంచో వేరుగా ఉంటున్న ఈ దంపతులు పూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికి పరోక్షంగా సమంతే కారణమైనట్టు అయింది. ఆ సినిమా సమంత చేసినా, లేదా అమలా పేరును సూచించకుండా ఊరుకున్నా ఈ విడాకులు గొడవ సంభవించేది కాదు. ఇదిలా ఉంటే అమలాపాల్ చాలాకాలంగా ఢిల్లీకి చెందిన ఓ పంజాబీ డిజైనర్ తో రిలేషన్షిప్ లో ఉందని సమాచారం.

Videos

21 thoughts on “అమలాపాల్ కాపురంలో చిచ్చు పెట్టిన సమంత

Leave a Reply

Your email address will not be published.