అక్కినేని అత్తా కోడల్లు…

సమంత.. అక్కినేని ఇంటి కోడలు అని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఇటీవలే నాగార్జున కూడా దీనిపై బహరంగ ప్రకటన చేశాడు కూడా. త్వరలోనే సామ్ మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేయబోతున్నాడు. అక్కినేని అభిమానులూ వారి పెళ్లి కోసం, వారి పెళ్లి తేదీ కోసం చాలా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానులకు సోషల్ మీడియాలో ఓ ఫొటో ఆనందాన్ని పంచుతోంది. అదే సమంత..

తన కాబోయే అత్త అమలతో కలిసి ఉన్న ఫొటో. అన్నపూర్ణ స్టూడియోలో ఇటీవల వాళ్లిద్దరూ కలిసిన సందర్భంలో తీసిన ఫొటో ఇది. వాళ్లిద్దరూ కలిసి నడుస్తూ, మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలో సమంత చేతిలో బ్లూ కలర్ గొడుగు ఉంది. కాగా, అక్కినేని నాగ చైతన్య వివాహం సమంతతో త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కనపడటం ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. టీచర్స్ డే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అమలతో ఇలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ సైట్లలో హల్‌చల్ చేస్తోంది.

Videos

27 thoughts on “అక్కినేని అత్తా కోడల్లు…

Leave a Reply

Your email address will not be published.