రివ్యూ: పుష్కరానికోసారి “పద్మావత్” : భన్సాలీ టాప్‌క్లాస్‌ విజువల్స్‌ ..

సిల్వర్‌ స్క్రీన్ మీద సినిమా కథలను దృశ్యకావ్యంలా రూపొందించడంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దిట్ట అనడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసిన బ్లాక్, రామ్‌లీలా, బాజీరావు మస్తానీ చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం పద్మావతి. అయితే సెన్సార్ అభ్యంతరాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పద్మావత్ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రాణి పద్మావతిగా దీపికా పదుకొన్, అల్లావుద్దీన్ ఖిల్లీగా రణ్‌వీర్ సింగ్, రావల్ రతన్ సింగ్‌గా షాహీద్ కపూర్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏ మేరకు చేరుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

పద్మావత్ కథ ఇలా.. సింహళ దేశపు యువరాణి పద్మావతి (దీపికా పదుకోన్)కి వేట అంటే చాలా ఇష్టం. వేటాడుతుండగా పద్మావతి బాణం తగిలి మేవాడ్ వంశానికి చెందిన రావల్ రతన్ సింగ్ (షాహీద్ కపూర్) గాయపడుతాడు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం జరుగుతుంది. వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. తన ప్రేమను వ్యక్తం చేసిన రతన్ సింగ్.. పద్మావతిని పెళ్లాడటమే కాకుండా తన దేశం చిత్తోర్‌గఢ్‌కు తీసుకెళ్తాడు. కథ గమనంలో తన రాజగురువు రాఘవ కేతనుడికి పద్మావతి దంపతులు దేశ బహిష్కారం విధిస్తాడు. దాంతో రాఘవకేతనుడు ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ చెంతన చేరుతాడు. ఆ తర్వాత చిత్తోర్‌గఢ్‌పై ఖిల్జీ దండయాత్ర చేసి రతన్ సింగ్‌ను ఎత్తుకెళ్తాడు. అక్కడి నుంచి పద్మావతి చిత్ర కథ కొత్త మలుపు తిరుగుతుంది.

రాజ గురువు‌ను పద్మావతి దంపతులు ఎందుకు దేశ బహిష్కరణ విధిస్తాడు? ఖిల్జీకి రాజగురువు ఏమీ నూరిపోసి యుద్ధానికి పురిగొల్పుతాడు? చిత్తోర్‌గఢ్ నుంచి రతన్ సింగ్ బందీగా పట్టుకెళ్లిన తర్వాత ఏం జరిగింది? తన భార్తను ఎత్తుకెళ్లిన ఖిల్జీని పద్మావతి ఏ విధంగా ఎదురించింది? రతన్ సింగ్‌కు, అల్లాఉద్దీన్ ఖిల్జీకి జరిగిన యుద్ధంలో ఫలితమేమిటీ అనే సమస్యలకు సమాధానమే పద్మావత్ చిత్రం కథ.

తొలిభాగంలో పద్మావతి, రతన్ సింగ్ ప్రేమ, పెళ్లి అంశాలతో చకచకా కథ సాగిపోతుంది. చిత్తోర్‌గఢ్ సంస్థానంలో యువరాణిగా పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత రాజగురువు బహిష్కరణతో సినిమా మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపు ఈ కథ సాగుతూనే మరోపక్క అల్లాఉద్దీన్ ఖిల్జీ రాజ్యకాంక్ష, మగువల పట్ల మోహం అంశాలతో రణ్‌వీర్ సింగ్ నటనలో ఉగ్రరూపం చూపించడం జరుగుతుంది. చిత్తోర్‌గఢ్ కోటపై దండెత్తడం, ఆ తర్వాత పద్మావతిపై ఖిల్జీ కామవంచ రగలడం లాంటి అంశాలు సినిమాపై పట్టు బిగించేలా చేస్తాయి.

ఇక రెండోభాగానికి వస్తే రతన్ సింగ్‌ను ఖిల్జీ బంధించడం, ఆ తర్వాత పద్మావతి పాత్రలో దీపికా పదుకొన్ అభినయానికి పెద్ద పీట వేయడం ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతుంది. పద్మావత్ సినిమా చివరి 20 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లోనూ, చిత్ర చివరి అంకంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడికి చక్కటి ఫీలింగ్ కలుగజేస్తుంది.

టాప్‌క్లాస్‌ విజువల్స్‌ 
రాజ్‌పుత్‌ రతన్‌సింగ్‌కు తాను పంపిన వర్తమానానికి సమాధానం కోసం ఎదురుచూస్తుంటాడు అల్లావుద్దిన్‌ ఖిల్జీ. ఆ వర్తమానంలో ఏం పంపాడో చూసిన పద్మావతి దాన్ని కాల్చేస్తుంది. అల్లావుద్దీన్‌ ఎదురుచూస్తూనే ఉంటాడు. ఈ సన్నివేశాల్లో షాట్‌ కంపోజిషన్స్‌ ఒక చిన్న ఉదాహరణ మేకింగ్‌ పరంగా ‘పద్మావత్‌’ టాప్‌క్లాస్‌ అని చెప్పడానికి. యుద్ధం మొదలైందని తెలిశాక, పద్మావతి పరిగెత్తుకుంటూ కోట గుమ్మం వరకూ వెళ్లే సన్నివేశంతో పాటు చాలా చోట్ల కొన్ని అన్‌కట్‌ లాంగ్‌ టేక్స్‌ చూడొచ్చు. ఇలాంటివి సంజయ్‌ లీలా భన్సాలీ లాంటి మాస్టర్స్‌కే సాధ్యమనిపించే షాట్స్‌. సుదీప్‌ చటర్జీ సినిమాటోగ్రఫీలో అన్నీ మెరుపులే!

కాస్ట్యూమ్స్‌ ఈ సినిమాకు మేజర్‌ హైలైట్స్‌లో ఒకటి. భన్సాలీ సినిమాల్లో కాస్ట్యూమ్స్‌ వేరే లెవెల్‌ అనేలా ఉంటాయి. ఇందులోనూ అది కనిపిస్తుంది. అదేదో మెయిన్‌ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాకుండా ప్రతీ క్యారెక్టర్‌కూ కాస్ట్యూమ్స్‌ టాప్‌క్లాస్‌ ఉండేలా చూసుకున్నారు. కాస్ట్యూమ్‌ కలర్స్‌ కూడా కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. టెక్నికల్‌ అంశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. క్లైమాక్స్‌ ఎలివేట్‌ అయ్యేదంతా స్కోర్‌తోనే! పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్, షాహిద్‌ కపూర్, అదితిరావు హైదరి లాంటి స్టార్స్‌ ఉన్నారు ఈ సినిమాలో. వాళ్లను చూస్తేనే ఏదో మ్యాజిక్‌ చెయ్యగలరన్న నమ్మకం కలిగించే స్టార్స్‌ అంతా. ఆ నమ్మకాన్ని ఎవ్వరూ వమ్ము చెయ్యలేదు. ప్రతీ ఒక్కరిదీ టాప్‌క్లాస్‌ పర్‌ఫార్మెన్స్‌. రణ్‌వీర్‌ సింగ్‌ వరుసగా తాను నెక్స్‌›్ట జనరేషన్‌ సూపర్‌స్టార్‌ అనిపించుకునేలానే నటించేశాడు.

బలం, బలహీనతలు

ప్ల‌స్ పాయింట్స్ :

సంజ‌య్ లీలా భ‌న్సాలీ టేకింగ్‌
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొన్, షాహీద్ కపూర్ నటన
కళా విభాగం పనితీరు, నిర్మాణ విలువ‌లు
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ (ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్)

మైన‌స్ పాయింట్స్ :
తొలిభాగం స్లో నెరేష‌న్‌లో సాగ‌డం
యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత లేకపోవడం

Videos

5 thoughts on “రివ్యూ: పుష్కరానికోసారి “పద్మావత్” : భన్సాలీ టాప్‌క్లాస్‌ విజువల్స్‌ ..

Leave a Reply

Your email address will not be published.