’సర్దార్’సత్తా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి క్రేజ్‌తో వేరే ఏ సినిమా రాకపోవడంతో సర్దార్‍పైనే అందరి కళ్ళూ పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న విడుదల కానున్న ఈ సినిమా సందడి ఇప్పటికే మొదలై జోరుగా సాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలాచోట్ల ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. ఇక సినిమాకు ఈ స్థాయి క్రేజ్ ఉన్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు కూడా టికెట్ ధరను పెంచే ఆలోచన చేస్తున్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ మానియా రాను రాను మరీ పెరుగుతోంది. ఈ హైప్ ను క్యాష్ చేసుకోవడానికి స్పెషల్ షోలు రెడీ అవుతున్నాయి. వీటికి భయంకరమైన డిమాండ్ వస్తుండడంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ ఓ రేంజ్ లో రేట్లు చెబుతున్నారని వినికిడి. దాంతో ఇలా షోలు వేసే అలవాటు వున్నవారు, లెక్కలు కట్టి, లాభ నష్టాలు బేరీజు వేసుకుని, వెనకడుగు వేస్తున్నారు.

ఎంతయినా ఫరవాలేదు.. రెండు వేలు టికెట్ రేట్ ఫిక్స్ చేసి అమ్మేయగలం అనుకున్నవాళ్లు సిద్దపడుతున్నారు. అయితే ముందస్తుగా పర్మిషన్లకు అప్లయ్ చేస్తున్నారు, ఒప్పందాలు మాట్లాడుకుంటున్నారు కానీ, ఇంకా అసలు రేట్లు ఫైనల్ కాలేదు. టికెట్ ధరలు ఫిక్స్ కాలేదు.

పదిహేను వందల నుంచి రెండు వేలు టికెట్ ధర వుంటుందని అంటున్నారు. అంత అయితే కష్టం అని..వెయ్యి కచ్చితంగా వుంటుందని టాక్ వినిపిస్తోంది. బాహుబలి, శ్రీమంతుడు తరువాత స్పెషల్ షోలకు అంత డిమాండ్ వచ్చిన సినిమా ఇదే. నైజాం డిస్ట్రిబ్యూటర్ స్పెషల్ షో ల, తొలి రోజు కలెక్షన్ల  ద్వారానే పెట్టుబడిలో కాస్త చెప్పుకోదగ్గ మొత్తాన్నే తొలిరోజు రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా.

సర్దార్ గబ్బర్ సింగ్ మానియా రాను రాను మరీ పెరుగుతోంది. ఈ హైప్ ను క్యాష్ చేసుకోవడానికి స్పెషల్ షోలు రెడీ అవుతున్నాయి. వీటికి భయంకరమైన డిమాండ్ వస్తుండడంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ ఓ రేంజ్ లో రేట్లు చెబుతున్నారని వినికిడి. దాంతో ఇలా షోలు వేసే అలవాటు వున్నవారు, లెక్కలు కట్టి, లాభ నష్టాలు బేరీజు వేసుకుని, వెనకడుగు వేస్తున్నారు.

ఎంతయినా ఫరవాలేదు.. రెండు వేలు టికెట్ రేట్ ఫిక్స్ చేసి అమ్మేయగలం అనుకున్నవాళ్లు సిద్దపడుతున్నారు. అయితే ముందస్తుగా పర్మిషన్లకు అప్లయ్ చేస్తున్నారు, ఒప్పందాలు మాట్లాడుకుంటున్నారు కానీ, ఇంకా అసలు రేట్లు ఫైనల్ కాలేదు. టికెట్ ధరలు ఫిక్స్ కాలేదు.

పదిహేను వందల నుంచి రెండు వేలు టికెట్ ధర వుంటుందని అంటున్నారు. అంత అయితే కష్టం అని.. వెయ్యి కచ్చితంగా వుంటుందని టాక్ వినిపిస్తోంది. బాహుబలి, శ్రీమంతుడు తరువాత స్పెషల్ షోలకు అంత డిమాండ్ వచ్చిన సినిమా ఇదే. నైజాం డిస్ట్రిబ్యూటర్ స్పెషల్ షో ల, తొలి రోజు కలెక్షన్ల  ద్వారానే పెట్టుబడిలో కాస్త చెప్పుకోదగ్గ మొత్తాన్నే రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *