సరైనోడు కలెక్షన్స్ పై అనుమానాలు, లెక్కలు కరెక్టేనా?

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరైనోడు’. ప్రస్తుతం థియేటర్లలో ఇదొక్కటే స్టార్ హీరో సినిమా ఉండటం, ప్రేక్షకులకు ఇదొక్కటే బెటర్ ఆప్షన్ గా కనిపిస్తుండటంతో బాక్సాఫీసు వద్ద వసూళ్లు బాగానే వస్తున్నాయి.

బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 52 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రూ. 42.02 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమాకు వసూళ్లు బావున్నట్లు చెబుతున్నారు.

రెండో వారం కూడా యూఎస్ఏలో సినిమా బాగా ఆడుతుంది. త్వరలోనే 1 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు $ 826,442 [రూ 5.49 కోట్లు] వసూలు చేసింది.

అయితే ‘సరైనోడు’ కలెక్షన్ల వివరాలపై పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల కలెక్షన్లు తక్కువ వస్తున్నా ఎక్కువ చేసి చూపెడుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. బన్నీ కెరీర్లో ఈ చిత్రాన్ని భారీ మాస్ హిట్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ఏరియా కలెక్షన్స్ (షేర్)

నైజాం13.97 కోట్లు
సీడెడ్8.18 కోట్లు
కృష్ణా2.84 కోట్లు
గుంటూరు3.87 కోట్లు
నెల్లూరు1.64 కోట్లు
తూర్పు గోదావరి3.53 కోట్లు
పశ్చిమ గోదావరి3.10 కోట్లు
వైజాగ్5.35 కోట్లు
కర్ణాటక6.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా1.10 కోట్లు
ఓవర్సీస్3.95 కోట్లు

మొత్తం53.78 కోట్లు

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *