పవర్ స్టార్, ఎన్టీఆర్‌లను ప్రశంశల వర్షంలో తడిపేసిన నగ్మా

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో వరుసగా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో మెప్పించిన నగ్మా…వయసైపోయాక చాలా మంది హీరోయిన్స్‌లాగే పాలిటిక్స్‌లో సెటిల్ అయింది. అక్కడ కూడా పెద్దగా కలిసిరాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ నదియాలాగా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అవ్వాలనుంకుంటోంది. ఈ మధ్య నగ్మాను కలిసిన తెలుగు జర్నలిస్ట్స్‌తో ఇదే విషయం చెప్పింది నగ్మా. అంతేకాదండోయ్ తెలుగు టాప్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల టాలెంట్‌ని ఓ రేంజ్‌లో కొనియాడింది. తెలుగులో పవర్ స్టార్ కుండే క్రేజ్ అసామాన్యమని, వేరే ఏ హీరో కూడా పవన్‌ని ఆ విషయంలో బీట్ చేయలేరని చెప్పింది. పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ వస్తే వదులుకునే ప్రసక్తే లేదని, త్వరలోనే పవన్‌తో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కళ్యాణ్‌కి బెంగాల్‌లో కూడా సూపర్ క్రేజ్ ఉందని చెప్పింది. అసలే బెంగాల్ టైగర్ కదా… ఉండే ఉంటుంది మరి.

మరో వైపు ఎన్టీఆర్‌లో ఉన్న గొప్ప నటుడంటే పర్సనల్‌గా నాకు చాలా ఇష్టమని చెప్పింది. అల్లరి రాముడు సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించినప్పటికీ ఆ ఎన్టీఆర్‌కి ఇప్పుడున్న ఎన్టీఆర్‌కి అస్సలు సంబంధమే లేదని నటుడిగా, మనిషిగా కూడా చాలా ఎదిగాడని, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ నటన అయితే ఎక్స్‌ట్రీమ్‌లీ సూపర్బ్ అని చెప్పింది నగ్మా. మరోసారి ఎన్టీఆర్‌తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పింది. మరి మన తెలుగు డైరెక్టర్స్ ఈ బ్యూటీని కరుణిస్తారంటారా? పొగరుబోతు అందగత్తె పాత్రలయితే మాత్రం కచ్చితంగా నగ్మా బెటర్ ఆప్షనే అవుతుంది మరి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *