కామెడీ, క్రైమ్, థ్రిల్… శమంతకమణి ట్రైలర్

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శమంతకమణి. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది,రాజేంద్ర ప్రసాద్, అనన్య సోనిలు ఈ మల్టీ స్టారర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సుధీర్ బాబు తనయుడు దర్శన్ కూడా ఈ మూవీలో న‌టిస్తున్నాడు. తొలి సారి తండ్రి, తనయులు శమంతకమణి చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.నలుగురు మీడియం హీరోలు వున్నా కూడా జస్ట్ పది కోట్ల లోపు బడ్జెట్ లో ఈ సినిమా ఫినిష్ చేయడం విశేషం.

ఖరీదైన రోల్స్ రాయిస్ కారు చుట్టూ తిరిగే థ్రిల్లర్ జోనర్ కథ ఇది. ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటిస్తున్నారు. పదికోట్ల లోపు బడ్జెట్ తో తయారైన ఈ సినిమాకు శాటిలైట్ ముందే ఫినిష్ చేసేసారు. రెండున్నర కోట్ల రేంజ్ లో ఫినిష్ అయింది. ఆంధ్రను నాలుగు నుంచి అయిదు కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు.

రెండు నిమిషాలకు రెండు సెకన్ల నిడివి తక్కువగా ఉన్న ట్రైలర్ను చూస్తేనే ఇదో క్రైమ్ థిల్లర్ మూవీలా అనిపిస్తుంది. అయితే.. ఈ జానర్ లో ఉండే లోపం ఏమిటంటే.. సరైన టైమింగ్ తో కూడిన కామెడీ అన్నది లేకపోవటం. కానీ.. శమంతకమణిలో ఆ లోటును కూడా తీర్చేశారన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్తో చెప్పేశారు.

సినిమా కథ అవుటర్ లైన్ మనసుకు పట్టేసేలా కట్ చేసిన ఈ ట్రైలర్ చూసినంతనే.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్న క్వశ్చన్ మనసులోకి రావటం ఖాయం.  హైదరాబాద్ లో ఖరీదైన రెస్టారెంట్.. అక్కడో పార్టీ.. 500 మంది జనాలు.. ఆ పార్టీకి వచ్చే రూ.5 కోట్ల విలువైన కారు.. దాని కోసం డబ్బు అవసరం ఉన్న వారి లక్ష్యం.

ఇలా కథ ఎలా ఉంటుందో చెప్పేశారు. అయితే.. మధ్యలో హీరోయిన్ ముచ్చట తెచ్చేయటం.. మన కుర్రాళ్లందరికి అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ గురూ.. అంటూ ఫినిషింగ్ డైలాగ్తో ట్రైలర్ క్లోజ్ చేయటం చూస్తే.. సినిమాలో విషయం చాలానే ఉందన్న విషయాన్ని దర్శకుడి ట్రైలర్ తో చెప్పేశాడు. జులై రెండో వారంలో థియేటర్లను టచ్ చేయనున్న ఈ మూవీపై తాజా ట్రైలర్ మరింతగా అంచనాలు పెంచేసేదిలా ఉందని చెప్పక తప్పదు.

ఖరీదైన రోల్స్ రాయిస్ కారు చుట్టూ తిరిగే థ్రిల్లర్ జోనర్ కథ ఇది. ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటిస్తున్నారు. పదికోట్ల లోపు బడ్జెట్ తో తయారైన ఈ సినిమాకు శాటిలైట్ ముందే ఫినిష్ చేసేసారు. రెండున్నర కోట్ల రేంజ్ లో ఫినిష్ అయింది. ఆంధ్రను నాలుగు నుంచి అయిదు కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.