అల్ల‌రి న‌రేష్ `సెల్ఫీరాజా`కు శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్‌

ఈ తరం హీరోల్లో తనదైన కామెడితో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్ తో గతంలో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సెల్ఫీరాజా’. చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ హీరో శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తుండ‌టం విశేషం. ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. గ‌మ్యం వంటి బెంచ్ మార్క్ మూవీతో పాటు, నువ్వా నేనా అనే ఎంట‌ర్ టైనింగ్ మూవీలో శ‌ర్వానంద్‌, అల్ల‌రి న‌రేష్‌ల కాంబినేష‌న్ స‌క్సెస్ అయ్యింది. సెల్ఫీరాజా చిత్రానికి వాయిస్ అందించ‌డం ద్వారా వీరు మూడోసారి క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్ట‌య్యింది.

సినిమా టైటిల్ నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుద‌ల‌కు ముందు టూర్ లో విడుద‌ల చేసిన సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. నరేష్ నుండి ఎలాంటి కామెడి కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడితో నరేష్ నవ్వించడానికి జూలై 15న సెల్ఫీ రాజాగా రెడీ అయిపోయారంటూ చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *