సమంత పిచ్చి ఎక్కించేస్తోంది బాబోయ్

రామ్ చరణ్ మూవీ రంగస్థలం ఫస్ట్ లుక్ వచ్చేసింది. మొదట చెప్పినట్లు కాకుండా.. 1985 అనే అక్షరాలను టైటిల్ నుంచి తీసేశారు. అలాగే చెప్పిన రోజున కాకుండా.. ఆ తర్వాత రోజున ఫస్ట్ లుక్ వదిలారు. ఇందులో రామ్ చరణ్ లుక్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు సమంతకు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఆన్ లైన్ లో హల్ చల్ చేసేస్తున్నాయి.

అలాగే ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న రంగస్థలం సినిమా కూడా చాలా కొత్తగా ఉందని పోస్టర్లే చెబుతున్నాయి. మొన్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఊర మాస్ లుక్కులో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోస్ లలో సమంత మాత్రం ఎవరు కలలో కూడా ఊహించని రేంజ్ లో కనిపిస్తోంది.

విలేజ్ లో పేదింటికి చెందిన అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులను చేస్తూ కనిపించింది. గేదెలను తీసుకువస్తూ.. కట్టెల పొయ్యి వద్ద వంట చేస్తూ చాలా కొత్తగా కనిపించింది. దర్శకుడు సుకుమార్ సమంత ని చాలా కష్టపెట్టినట్లు తెలుస్తోంది. పోటోలను చూసి ఆమె ఫ్యాన్స్.. అయ్యో సమంతకి ఎంత కష్టమొచ్చిందో అని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.

Shocking-Change-Over-Of-Samantha-In-Rangasthalam

Videos

37 thoughts on “సమంత పిచ్చి ఎక్కించేస్తోంది బాబోయ్

Leave a Reply

Your email address will not be published.