కమల్‌హాసన్‌తో గౌతమి విడిపోవడానికి కారణం ఇదేనా?

పదమూడేళ్లుగా కలిసి జీవిస్తున్న కమల్ హాసన్… గౌతమి బంధానికి తెరపడింది. మేం విడిపోతున్నామని నిన్ననే తన బ్లాగ్ లో స్వయంగా  ప్రకటించింది గౌతమి. అయితే ఒకరికొకరు తోడునీడగా ఉన్న ఆ  ఇద్దరి మధ్య చిచ్చు రేగడానికి  శృతిహాసనే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొంతకాలం కిందటే శృతిహాసన్ కీ – గౌతమికీ మధ్య గొడవ జరిగందని – ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి కమల్ – గౌతమి విడిపోవడానికి కారణమైందని తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  కమల్ కథానాయకుడిగా నటిస్తూ తెరకెక్కిస్తున్న `శభాష్ నాయుడు`లో శృతిహాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

అయితే గౌతమి డిజైన్ చేసిన దుస్తుల్ని తాను ధరించనని శృతి మొండికేసినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట. ఆ విషయంపై శృతి స్పందించింది కూడా.  కాస్ట్యూమ్స్ డిజైనింగ్ విషయంలో నాకూ మంచి అవగాహన ఉందని అందుకే కొన్ని దుస్తులు  మార్చమని చెప్పానని… నా అభిప్రాయానికి తగ్గట్టుగానే గౌతమి కాస్ట్యూమ్స్ మార్చింది తప్ప మేం గొడవ పడిందంటూ ఏమీ లేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది శృతి.  కానీ ఆ ఉదంతమే కమల్ కీ – గౌతమికీ మధ్య ఆజ్యం పోసిందనేది  చెన్నై సినీ వర్గాల మాట. ఆ గొడవ విషయంలో కమల్ తన కూతురైన శృతినే వెనకేసుకొచ్చాడని అది గౌతమికి నచ్చకపోవడంతో ఆమె కొన్నాళ్లుగా కమల్ కి దూరంగా ఉంటోందని తెలిసింది.  మరి కాస్ట్యూమ్స్ గొడవ విషయంపై స్పందించినట్టుగానే…  బ్రేకప్ విషయంలో తన  పాత్రపై జరుగుతున్న ప్రచారంపై కూడా శృతి స్పందిస్తుందేమో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *