శృతి ఏంటీ…ఇంత ఘాటుగా…

శృతిహాసన్‌ ఇప్పుడు యమఫాస్ట్‌ అయిపోమయింది. తనకి ఏది నచ్చితే అది..ఎలా అనిపిస్తే అలా చెయ్యడానికి కాస్తంత కూడా ఆలోచించట్లేదు.  అయితే శృతిహాసన్‌ కొద్ది కాలంగా తన శరీరాకృతికి సంబంధించి విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రేమమ్‌ చిత్రానికి విపరీతంగా ట్రోలింగ్‌కి గురయిన శృతిహాసన్‌ ‘కాటమరాయుడు’ చిత్రానికి కూడా నెగెటివ్‌ కామెంట్స్‌ ఫేస్‌ చేసింది. అసలే అవకాశాలు తగ్గిపోతోన్న దశలో ‘సంఘమిత్ర’ చిత్రం నుంచి తప్పుకుంది.

ఇక ఇదిలాఉంటే శృతి ఇప్పుడు  నా శరీరం.. నా ఇష్టం…అంటోంది. నేనేం చేసినా అది సినిమాల కోసమే.. అని తేల్చి చెబుతోంది. అంతటితో ఆగకుండా అడగడానికి మీరెవరు..? అని ప్రశ్నించేస్తోంది.   ఇంతకీ విషయం ఏమిటంటే.. శృతి  ముక్కు, పెదవులు ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నాయి.

దీంతో ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందనే పుకార్లు స్టార్ట్‌ అయ్యాయి. శ్రుతి హాసన్ పెదవులకు సర్జరీ చేయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరింత అందంగా కనిపించడానికే శ్రుతి అలా చేసిందనే మాట కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ భామామణుల్లో చాలా మంది ఇలా సర్జరీలు చేయించుకొంటూ ఉన్నారు. ఈ క్రమంలో శ్రుతి కూడా లిప్ జాబ్ చేయించుకుంది.

ఈ విషయం గురించి ఆరా తీస్తేనే ఆమెకు కోపం వస్తోంది. ఈ విషయం గురించి చెప్పడానికి ఇష్టపడక, అడుగుతున్న వారిపై విరుచుకుపడుతోంది. అయితే ఈ పుకార్లకి శృతి విచిత్రంగా స్పందించింది.  తను సినిమాల కోసమే ఆ సర్జరీ చేయించుకుంటున్నట్టుగా చెబుతోంది. సినిమాల కోసం బరువు పెరగడం, సన్నబడటం ఎంత సహజమో.. సర్జరీ కూడా అంతే సహజం అని శ్రుతి  ఘాటుగానే స్పందిస్తోంది. ఇటీవల జరిగిన ట్రోలింగ్‌, తగ్గిపోయిన అవకాశాలు ఈ బ్యూటీని చాలా ఇబ్బంది పెడుతున్నాయనే సంగతి ఆమె స్పందనలోనే తెలుస్తోంది.

ఏదేమైనా.. కమల్ హాసన్ తనయకు సర్జరీలు కొత్తేమీ కాదు. కెరీర్ ఆరంభానికి ముందే ఈమె ఫేస్ కు కొన్ని రిపేర్లు చేసుకుని వచ్చింది. తొలి సినిమాకు ముందే ముక్కుకు సర్జరీ చేయించుకుని.. దాన్ని అందంగా తీర్చిదిద్దుకుని శ్రుతి హాసన్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు ఉన్న అందం చాలనట్టుగా పెదాల సర్జరీ చేయించుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *