బెంగళూరులో 100 % కన్నడిగులకే ఉద్యోగాలు: సిద్ధరామయ్య..

డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందునుంచే ఆయన మన ఉద్యోగాలు మనకే అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆయన సక్సెస్ లో ఆ నినాదం పాత్ర తక్కువేమీ కాదు. సిలికాన్ వ్యాలీపై తీవ్ర ప్రభావం చూపే ట్రంప్ పాలసీ వ్యక్తిగతంగా మాత్రం ఆయన్ను గెలిపించింది. ట్రంప్ సక్సెస్ సీక్రెట్ తెలుసుకుని ఇన్ స్పైర్ అయ్యారో ఏమో కానీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా దాదాపుగా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరులో పరాయి రాష్ట్రాలవారు పనిచేయకుండా కేవలం కన్నడిగులు మాత్రమే పనిచేసేలా రూల్ తేనున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఈ ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు.

ఇండియన్ సిలికానీ వ్యాలీ బెంగళూరులో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు – ఏపీ – తెలంగాణలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు వచ్చి పనిచేస్తారు. అన్ని సాఫ్టువేర్ కంపెనీల్లో పరాయి రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. కానీ.. ఇక నుంచి సిద్ధరామయ్య కొత్త నిబంధనలు తెస్తే అది కుదరదు. 100 శాతం లోకల్ వాళ్లనే నియమించుకునేలా కర్ణాటక పరిశ్రమల శాఖ నిబంధనలను సవరించబోతున్నారట.

కాగా ఇది కేవలం ఐటీకే కాకుండా మిగతా రంగాలకూ వర్తించేలా చట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు కూడా విపరీతంగా ఉన్నాయి. చదువురాని వాళ్లకు కూడా ఏదో ఒక కంపెనీలో సులభంగా పని దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ బెంగళూరు వెళ్లేందుకు ఇష్టపడతారు. అక్కడ వాతవరణం కూడా అనుకూలంగా ఉండడంతో బెంగళూరు అందరినీ ఆకర్షిస్తోంది.  మరో ఏడాదిన్నలో కర్ణాటక శాసన సభకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో లోకల్సుకే ఉద్యోగాలు అన్న నినాదంతో పరాయి రాష్ట్రాలవారికి బ్రేకు వేయడానికి సిద్ధరామయ్య సిద్ధమవుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *