మాజీ ఎంపీ మధుయాష్కితో ఎఫైర్‌పై సింగ‌ర్ సునీత కామెంట్‌

బాధ నుంచి బయటపడడానికి ఆరేళ్ల క్రితం ఓసారి, రీసెంట్‌గా మరోసారి సైకియాట్రిస్ట్‌ని కలిసి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే.. సొసైటీలో ఓ వ్యక్తి గురించి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ల జీవితం గురించి తెలుసుకోకుండానే ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది చాలా తప్పు.’ అంటున్నారు ప్రముఖ గాయని సునీత.

సింగర్ సునీత తెలియనివారు తెలుగులో తక్కువ. ఆమె పాట వినని మరీ తక్కువనే చెప్పాలి. అంతగా ఆమె తెలుగువారి జీవితాల్లోకి వెల్లిపోయింది. ఆమె మాధుర్యమైన వాయిస్, అంతకు మించి అందమైన సింగర్ అనే పేరు తెచ్చుకున్న సునీత…ఏదో ఒక రాంగ్ కారణాలతో మీడియా లో నానుతోంది. ఆమె అందమే శాపమా అన్నట్లుగా ఎప్పుడూ ఏదో ఒక రూమర్ మీడియాలో వస్తూనే ఉంది.19 ఏళ్ల‌కే కిర‌ణ్ అనే ఇండ‌స్ర్టీకి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది.ఇద్దరు పిల్లలు పుట్టాక కిరణ్ తో విబేధాలు రావ‌డంతో అతడికి దూరంగా ఉంటుంది. ఈ లోపు రకరకాల రూమర్స్ ఈమె ఫై వచ్చాయి..

తాజాగా ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భర్త ఫైనే కాకుండా రూమర్స్ ఫైకూడా సమాధానం తెలిపింది. తన భర్త నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడనే , భార్య , పిల్లలను పట్టించుకోని వాడు ఓ భర్త నే అంటూ వాపోయింది. తన భర్త నుండి విడిపోయాక , అతడి తరుపు వారు కావాలని నా ఫై చెడు ప్రచారం చేసారని ఓ దర్శకుడి తో అక్రమ సంబంధం కలిపారని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత ఓ మీడియా వారు ఓ రాజకీయ నాయకుడి కి నాకు అక్రమ సంబంధం కలిపి తప్పుడు ప్రచారం చేసారని ఆ తర్వాత వారు నాకు క్షేమపణలు తెలిపారని ఇంటర్వ్యూ లో చెప్పుకొని బాధపడింది. ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలు పెద్దవారు అవుతున్నారు. వారిని చూసుకోవడం తప్ప మరేతర విషయాల ఫై దృష్టి పెట్టకోడదని నిర్ణయించుకున్నని తెలిపింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *