బాల‌య్య నా అన్న అంటోన్న స్టార్ హీరో

తెలుగు స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ శైలీ ఎంతో విభిన్నంగా ఉంటుంది. టాలీవుడ్‌లో బాల‌య్య అగ్ర‌హీరోగా కంటిన్యూ అవుతున్నా చిత్ర‌సీమ‌లో త‌న‌తో అనుబంధం ఉన్న హీరోల‌తో ఆయ‌న అప్యాయ‌త‌లు, అనురాగాలు ఎప్పుడూ కంటిన్యూ చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌కు సౌత్ టు నార్త్ వ‌ర‌కు ఎంతో మంది సీనియ‌ర్ హీరోలు, త‌న తోటి హీరోల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయి.

నాడు బాల‌య్య తండ్రి ఎన్టీఆర్‌తో స్నేహం ఉన్న సీనియ‌ర్ హీరోల‌తో కూడా బాల‌య్య చాలా స్నేహంగా ఉంటుంటారు. ఇటీవ‌లే బాల‌య్య స‌ర్కార్‌-3 షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ‌చ్చ‌న్‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఇక క‌న్న‌డ సీనియ‌ర్ స్టార్ హీరో రాజ్‌కుమార్‌తో సైతం బాల‌య్య తండ్రి ఎన్టీఆర్‌కు ఎంతో అనుబంధం ఉంది.

వీరి త‌ర్వాత వీరి కుమారులు అయిన బాల‌య్య‌, శివ‌రాజ్‌కుమార్ సైతం ఆ బంధాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య వందో చిత్రం శాత‌క‌ర్ణిలో శివ‌రాజ్‌కుమార్ ఓ ప్ర‌త్యేక‌పాత్ర పోషిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా శివ‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ బాల‌య్య తనకు అన్నయ్యలాంటి వాడని తెలిపాడు.

‘బాలకృష్ణ నాకు అన్నయ్యలాంటి వాడు. ఇది నాకు కుటుంబ సినిమాలాంటిది. నాన్నగారు (రాజ్‌కుమార్‌), ఎన్టీఆర్‌ అన్నదమ్ముల్లా ఉండేవారు. ఇప్పుడు బాలయ్య, నేను అలాగే ఉంటున్నాం. ఆయన బెంగళూరు వచ్చిన ప్రతీసారీ నన్ను కలుస్తుంటారు. ఇప్పుడు ఆయనకు ఎంతో ముఖ్యమైన చిత్రంలో ఓ భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంద’ని శివరాజ్‌ కుమార్‌ అన్నాడు. ఇటీవ‌ల శివ‌రాజ్‌కుమార్ న‌టించిన సినిమా శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల‌కు సైతం బాల‌య్య ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *