‘Sorry’కి స్మృతి నో

జెఎన్‌యుపై చర్చ సందర్భంగా గురువారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఈ రోజు ఆందోళనకు దిగాయి. స్మృతి ఇరానీ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకూ సభ జరగనీయమని బిఎస్పీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు మాయావతి డిమాండ్ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ మాయావతికి మద్దతు పలికాయి. స్మృతి ఇరానీ.. దుర్గాదేవిని అవమానించారని విపక్షాలు ఆరోపించాయి

ఆమె క్షమాపణ చెప్పాలని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలన్నారు. దీంతో, నిబంధనలు పరిశీలించి అనంతరం రికార్డుల నుంచి తొలగిస్తామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ చెప్పారు.అయితే, విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘాటుగానే తిప్పికొట్టారు. తాను ఎవరి మనోభావాలను కించపరిచేలా మాట్లాడలేదన్నారు. నేను హిందువునని, దుర్గాదేవి భక్తురాలినని చెప్పారు. దీంతో ఇవాళ కూడా రాజ్యసభలో జెఎన్‌యు వివాదం కొనసాగుతోంది. తాను దుర్గాపూజ చేస్తానని చెప్పారు.

Videos

139 thoughts on “‘Sorry’కి స్మృతి నో

Leave a Reply

Your email address will not be published.