షాక్: పోలీసుల అదుపులో సోనియా..రాహుల్..మన్మోహన్ సింగ్

సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని తన రిమోట్ తో కంట్రోల్ చేసిన సత్తా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీది. పదేళ్లు నాన్ స్టాప్ గా పవర్ ను ఎంజాయ్ చేసిన ఆమె.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలు కావటం తెలిసేందే. పవర్ ఉన్నప్పుడు సోనియమ్మ రాజసానికి.. పవర్ పోయాక అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మధ్యన తరచూ కనిపించే పరిస్థితి. తాజాగా ఆగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంపై మోడీసర్కారు జోరుగాపావులు కదుపుతున్న వేళ.. సోనియమ్మ అండ్ కో ఎంతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో తెలిసిందే.

ఆగస్టా మంట ఒక పక్కన పెరుగుతున్న వేళ.. తప్పుడు హామీలతో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ సేవ్ డెమోక్రసీ పేరిట భారీ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా సోనియమ్మ మాట్లాడుతూ.. మోడీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని పేర్కొనటంతో పాటు.. అలా చేస్తుంటూ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదంటూ మండిపడ్డారు.

జీవితంలో తాను చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని.. ఎప్పుడూ పోరాడుతూ ఉండాలని జీవితం నేర్పిందని.. ధనబలంతో ఉత్తరాఖండ్.. అరుణాచల్ ప్రదేశ్  రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చారని మండిపడ్డారు. ఓపక్క ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. మరోపక్క అగస్టా వెస్ట్ ల్యాండ్ పేరుతో అందరి దృష్టిని మళ్లిస్తున్నట్లుగా మండిపడ్డారు. ఇలా అమ్మ దగ్గర నుంచి అమ్మ విధేయులంతా ఒకరి తర్వాత ఒకరుగా ఎన్డీయే సర్కారు మీద తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.

ప్రసంగాల అనంతరం పార్లమెంటుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లగా.. ఇలాంటి వాటి మీద ఉన్న పరిమితుల్ని ఉల్లంఘించారంటూ సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ.. మన్మోహన్ సింగ్ లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొన్నారు.  ఎదురులేదు.. తిరుగులేదు అనుకుంటాం కానీ పవర్ కానీ లేకపోతే.. సోనియమ్మ అయితే.. రాహుల్ అయినా.. ఇంకెవరైనా పెద్ద తేడా లేదన్న మాటే.

Videos

35 thoughts on “షాక్: పోలీసుల అదుపులో సోనియా..రాహుల్..మన్మోహన్ సింగ్

Leave a Reply

Your email address will not be published.