మంత్రి లోకేశ్‌ కు చేదు అనుభవం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు నారా లోకేశ్‌, అమర్‌ నాథ్‌, మాజీ మంత్రి గొజ్జల గోపాలకృష్ణా రెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్పా మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. కాళహస్తిలో రోడ్డు విస్తరణ జరిగివుంటే ప్రమాదం జరిగుండేది కాదన్నారు. ‘అమరావతిలో రోడ్డు వేయడం కాదు మా సంగతి పట్టించుకోండి’ అంటూ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. లోకేశ్‌ సమక్షంలోనే బొజ్జలపై బాధిత మహిళ విరుచుకుపడింది.

‘మీ వెనుకున్న వారే ఇదంతా చేశారు. బొజ్జల అనుచరుల వల్లే ఊరు వల్లకాడుగా మారింది. పదిలక్షలిస్తా నా భర్తను తీసుకొస్తారా’  అంటూ నిలదీయడంతో సమాధానం చెప్పలేక అక్కడ నుంచి బొజ్జల వెనుదిరిగారు. ఏర్పేడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. స్విమ్స్‌ లో చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *