రైతు భరోసా…ఎంపిక ప్రక్రియ మొదలు

రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏటా మే నెలలో రైతులు సాగు మొదలుపెట్టేందుకు పెట్టుబడిగా రూ.12,500 ఇస్తామని ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ఈ హామీ అమలుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 15 నాటికి రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక అ«ధికారిని కలెక్టర్‌ ముత్యాలరాజు నియమించారు. ప్రధానమంత్రి కిసాన్‌ పథకం కింద వెబ్‌ల్యాండ్‌ సమాచారం ఆధారంగా 3,45,978 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ డేటాను వైఎస్సార్‌ భరోసా పథకానికి కూడా అన్వయించి పరిశీలన చేస్తున్నారు. మంగళవారం వరకు 3,14,183 మంది రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి 2,61,801 మందిని అర్హులుగా గుర్తించారు. తాజాగా   మరో 18,641 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిని కూడా నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉంటే ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

Videos