ఎక్స్‌పోజింగ్‌కు గేట్లు ఎత్తేసిన యాంక‌ర్ శ్రీముఖి

ఇప్పటికే తెలుగు యాంకర్స్ అటు యాంకరింగ్ చేస్తూ ఇటు సినిమాల్లో నటించేస్తూ తెగ బిజీ అయిపోతున్నారు. నిన్నటికి నిన్న హాట్ యాంకర్ గా పేరుకొట్టేసిన అనసూయ బుల్లితెర జబర్దస్త్ ప్రోగ్రాం నుండి వెండితెర ‘సోగ్గాడే చిన్నినాయనా’ లో మెరిసింది. తర్వాత ‘క్షణం’ లో లీడింగ్ కేరెక్టర్ కొట్టేసింది. అయితే హీరోయిన్ గా అయితే ఇంకా బాగుంటుంది కదా అనుకుని తెగ హాట్ హాట్  ఫోటో షూట్స్ చేయించుకుంటుంది. ఆ ఫొటోస్ ఇప్పుడు  సోషల్ మీడియా లో ఇంకా వెబ్సైట్స్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అనసూయ అలా తన హాట్ యాంగిల్ ని ఇలా ఫోటో షూట్స్ తో చూపించేస్తుంది. అలాగే రష్మీ కి అయితే ఫోటో షూట్స్ తో పెద్దగా పనేం లేదు. తాను నటించిన సినిమాల్లో అందాలను ఆరబోస్తూ హాట్  హీరోయిన్ గా పేరు కొట్టేసింది. అయితే అనసూయ లాగా ఇప్పుడు ఆమె దారిలోనే యాంకర్ శ్రీముఖి నడుస్తుంది.

శ్రీముఖి కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇటు యాంకర్ గాను అటు వెండితెర మీదా ఒక వెలుగు వెలుగుతుంది. ఇంకా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తూ బాగా బిజీ గా మారిపోయింది ఈ భామ. ఇలా షార్ట్ ఫిలిమ్స్ గట్రా చేసుకుంటే ఎలా అనుకుందేమో ఇప్పుడు తన రూట్ మారుస్తున్నట్టు కనబడుతుంది. అదేమిటంటే మాములుగా ఉంటే మంచి కేరెక్టర్స్ రావేమో అనుకుందేమో అనసూయ లాగా ఒక హాట్ ఫోటో షూట్ చేయించుకుని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో శ్రీ ముఖిని చూసిన కుర్రకారుకి పిచ్చెక్కడం ఖాయం. మరంతలా తన అందాలను బ్లాక్ వైట్ లో చూపిస్తూ ఫోటో షూట్ చేయించుకుంది శ్రీముఖి. మరి శ్రీముఖి ఇలా ఫొటో షూట్ చేయించుకుంది కేవలం హీరోయిన్ పాత్రలు కొట్టెయ్యడానికే అని అప్పుడే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *